రూ.16 కోట్లు ఖర్చుపెడితే రూ.450 కోట్లు సంపాదించిపెట్టిన సినిమా
2022లో విడుదలైన 'కాంతార' చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతోపాటు కథానాయకుడిగా కూడా నటించారు. హోంబలే ఫిలింస్ సంస్థ కేవలం 16 కోట్ల రూపాయల పరిమిత బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. వాస్తవానికి దీన్ని కర్ణాటక ప్రేక్షకుల కోసమే తీశారు. పాన్ ఇండియాగా విడుదల చేద్దామనే ఆలోచన కూడా లేదు. కర్ణాటకలోని తుళునాడు ప్రాంతంలో ఉండే 'దైవారాధన', 'భూత కోల' సంప్రదాయాలను ఆధారంగా చేసుకొని సినిమా తీశారు.
తెలుగులో అల్లు అరవింద్ కొన్నారు
సెప్టెంబర్ 30, 2022న మొదటిసారిగా కన్నడంలోనే విడుదలైంది. అక్కడ ఇండస్ట్రీ హిట్ కావడంతో దేశవ్యాప్తంగా కాంతార చర్చనీయాంశమైంది. దీంతో మేకర్స్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో అల్లు అరవింద్ కొన్నారు. మౌత్ టాక్‌తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 450 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. పెట్టిన పెట్టుబడికి దాదాపు 25 రెట్లు లాభాలను తెచ్చిపెట్టి, భారత సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు గడించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

బీజీఎం సూపర్ అని చెప్పొచ్చు
ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు బి. అజనీష్ లోక్‌నాథ్ అందించిన BGM, 'వరాహ రూపం' పాట కీలక పాత్ర పోషించాయి. క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి ప్రదర్శించిన నటన, హావభావాలు, మనిషిని దైవం ఆవహించినప్పుడు ఆయన చేసే శబ్దాలు ప్రేక్షకులను విపరీతమైన థ్రిల్‌కు గురిచేశాయి. ఈ చిత్రానికి రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాలను గెలుచుకుంది. కన్నడలో రూ. 180 కోట్లు రాగా, తెలుగులో రూ.65 కోట్లు, హిందీలో రూ.100 కోట్లు, తమిళం, మళయాళం కలిపి రూ.35 కోట్లు, విదేశాల్లో రూ.45 కోట్లు వచ్చాయి. మొత్తం కలిపి రూ.450 కోట్లు రాబట్టి 25 రెట్ల లాభాన్ని నిర్మాతలకు కాంతార అందించింది.












Click it and Unblock the Notifications