Karthika deepam 3 December 3rd:దీప కడుపుపై పారిజాతం కొత్త కుట్ర..పాపం శౌర్య..!!

కార్తీకదీపం 2 సీరియల్‌లో గత ఎపిసోడ్ (530వ ఎపిసోడ్) లో జ్యోత్స్న ప్లాన్, శ్రీధర్-కాంచన మధ్య వాదనలు హైలైట్‌గా నిలిచాయి. కార్తీక్, దీపలను శివన్నారాయణ గారింటికి పంపకూడదని కాంచన నిర్ణయం తీసుకుంది. మరోవైపు, శౌర్య నిద్రలో దీప కడుపుకు కాలు తగలడంతో ఆమె నొప్పితో విలవిలలాడింది. ఈ పరిస్థితుల్లో నేటి ఎపిసోడ్ (531వ ఎపిసోడ్) మరింత ఉత్కంఠగా మారింది.

కడుపునొప్పితో దీప, ఆందోళనలో శివన్నారాయణ
కడుపునొప్పి వచ్చినా దీప ఆసుపత్రికి వెళ్లకపోవడంతో రాత్రి ఆమె త్వరగా పడుకుంది. కార్తీక్ కూడా ఆలస్యంగా లేవడంతో ఇద్దరూ డ్యూటీకి వెళ్లలేకపోయారు. దీనిపై పారిజాతం రగిలిపోతూ ఉండగా, శివన్నారాయణ కనుక్కోవడానికి కాంచనకు ఫోన్ చేశారు. దీపకు కడుపునొప్పి వచ్చిందని కాంచన చెప్పడంతో, శివన్నారాయణ తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే సుమిత్ర, డాక్టర్‌ను వెంటబెట్టుకుని కాంచన ఇంటికి చేరుకున్నారు. దీప కడుపు పోయిందని పారు లోలోపల సంతోషించింది.

Karthika deepam 3 Serial December 3rd Episode 531 Here is todays full story

కాంచనపై శివన్నారాయణ ఆగ్రహం
దీప కోసం డాక్టర్‌ను తీసుకొచ్చిన శివన్నారాయణ, కాంచనపై కోపం వ్యక్తం చేశారు. "ఒకప్పుడు దీపని ఇంట్లో అడుగుపెట్టొద్దన్న మనిషి.. ఈరోజు దీప కోసం తాపత్రయపడుతున్నాడని" అనసూయ మురిసిపోయింది. "దీప కడుపులో పెరుగుతున్నది నా మనవరాలు కాదు.. నా అమ్మ అని నువ్వు అన్నావు కదా, అమ్మని ఇలాగేనా చూసుకునేది" అని శివన్నారాయణ కాంచనకు క్లాస్ తీసుకున్నారు. తండ్రిలాగే, కార్తీక్ కూడా దీపను జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరించారు. రాత్రి జరిగిన విషయంపై పారిజాతం నిలదీయగా, శౌర్య కాలు తగిలిందని దీప డాక్టర్‌కు నిజం చెప్పింది. దీపకి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ ధృవీకరించారు, కానీ తొలి నాలుగు నెలలు జాగ్రత్తలు తీసుకోవాలని సుమిత్రకు సూచించారు.

శౌర్యపై విషం ఎక్కించిన పారిజాతం
దీపకు కడుపు నొప్పి రావడానికి కారణం శౌర్య కాలు తగలడమే అని తెలుసుకున్న కాంచన, కార్తీక్‌లు షాక్ అయ్యారు. ఈ సమయంలో పిల్లలను దూరంగా ఉంచాల్సిందేనని పారిజాతం సలహా ఇవ్వగా, అది కాంచన మనసుపై ప్రభావం చూపింది.

పారిజాతం వెంటనే శౌర్య దగ్గరికి వెళ్లి, రాత్రి నిద్రలో శౌర్యే అమ్మను కాలితో తన్నిందని, అందుకే డాక్టర్ వచ్చారని నమ్మించింది. శౌర్య కంగారు పడింది. మీ నానమ్మ మారింది, మీ అమ్మకు కొత్త బిడ్డ పుట్టబోతున్నందున తన ప్రేమంతా ఆ బిడ్డ మీదే ఉంటుందని, అందుకే నీకు సున్నుండలు పెట్టలేదని పారు విషం ఎక్కించింది. అంతేకాదు, ఇకపై అమ్మానాన్నలు కూడా నిన్ను దూరం పెడతారని, నువ్వు బాగా చూసుకోవాలంటే అల్లరి చేయాలని, మారాం చేయాలని శౌర్య మనసు చెడగొట్టింది. రాత్రి కాంచన, ఇప్పుడు శౌర్య నా బుట్టలో పడిపోయారు.. ఇక కార్తీక్‌కి నరకమే అని పారిజాతం మనసులో సంబరపడింది.

తల్లి, భార్యల మధ్యలో నలిగిపోతున్న కార్తీక్.. దీపను ఓదార్చడానికి హత్తుకున్నాడు. అయినప్పటికీ, కడుపునొప్పి తగ్గినా ఆసుపత్రికి వెళ్లడానికి దీప మొండిగా నిరాకరించడంతో కార్తీక్ కంటతడి పెట్టాడు. దీప మొండితనం చూసి కాంచనకు అనుమానం పెరిగింది.మరి శౌర్య అల్లరి వల్ల కార్తీక్, దీపలు ఎలాంటి ఇబ్బందులు పడతారు? కాంచన మనసు మారుతుందా? వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+