స్టార్ హీరో కాపురంలో నిత్యా మీనన్ చిచ్చు ..పెళ్లైన హీరోతో డేటింగ్..?
మలయాళ కుట్టి నిత్యా మీనన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ''అలా మొదలైంది'' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిత్యా మీనన్, తెలుగుతో పాటు, తమిళంలో కూడా నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ధనుష్ హీరోగా నటించిన ''తిరు'' సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో నటనగాను నిత్యా మీనన్ జాతీయ అవార్డు గెలుకున్నారు.
కథ నచ్చితే కానీ నిత్యా మీనన్ సినిమాను ఓకే చేయరు. కథలో తనకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు. ఇదిలా ఉంటే నిత్యా మీనన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిత్యా మీనన్ కారణంగా ఓ స్టార్ హీరో వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డారనేది ఈ వార్త సారాంశం. ఆ హీరో ఎవరో కాదు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్.. ఈయన తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ''ఈగ'' మూవీలో విలన్‌గా నటించారు. కిచ్చా సుదీప్‌తో నిత్యా మీనన్ ప్రేమలో పడ్డారని,వీరిద్దరు సీక్రెట్‌గా ప్రేమించుకున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి.

గతంలో సుదీప్ తన భార్య రాధికతో గొడవలు పడడానికి కారణం నిత్యామీనన్ అనే టాక్ కూడా వినిపించింది. అలాగే సుదీప్‌కి పెళ్ళై పాప కూడా ఉందనే విషయం తెలిసినా కూడా నిత్యా మీనన్ ఆయన్ని కోరుకుందట. అలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కారణంగా సుదీప్ తన భార్యకు విడాకులు ఇచ్చి నిత్యా మీనన్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సుదీప్ తన భార్యతో ఫ్యామిలీ కోర్ట్ లో విడాకులకు కూడా అప్లై చేశారు. నిత్యా మీనన్ వల్లే సుదీప్ అతని భార్య విడిపోతున్నారని ఆమెపై అందరు నెగటివ్ కామెంట్స్ చేశారు.
కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ సుదీప్ తన భార్యకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. సుదీప్ కూతురు కారణంగానే వీరు విడాకులు తీసుకోలేదని తర్వాత తెలిసింది. కూతురు కారణంగానే భార్యాభర్తలు విడాకులు తీసుకోవాలనే నిర్ణయాన్ని మార్చేసుకున్నట్టు తర్వాత బయటపడింది. అప్పట్లో నిత్యామీనన్ ,సుదీప్‌ల ప్రేమ వ్యవహారం మాత్రం కన్నడలో తీవ్ర దుమారం సృష్టించింది. అయితే ఈ ఇష్యూపై స్పందించిన నిత్యా మీనన్ .. తాను సుదీప్‌ను ప్రేమించానని వస్తోన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications