వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' టీజర్ వచ్చేసింది..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు' టీజర్ వచ్చేసింది. ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ థ్రిల్, కామెడీ ప్రధాన అంశాలుగా తెరకెక్కినట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. తాజాగా 'కొరియన్ కనకరాజు' టీజర్ ను పాన్ ఇండియా హీరో ప్రభాస్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ మూవీకి ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 7 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

ఇక ఈ చిత్రం విషయానికి వస్తే పెనుగొండ నుంచి కొరియా వరకు సాగే స్టోరీతో కొరియన్ కనకరాజు మూవీ తెరకెక్కినట్లు స్పష్టం అవుతోంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ మునుపెన్నడూ చూడని పాత్రలో నటించినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. అలాగే టీజర్ లో కనిపించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్, యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ మూవీతో పాటు వరుణ్ తేజ్ ప్రస్తుతం బరి అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ మూవీపై సినీవర్గాల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ సోదరి, మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఈ మూవీని దాదాపు రూ. 60 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరగా పూర్తిచేసి 2027 సంక్రాంతి బరిలో ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాలీబాల్ క్రీడ చుట్టూ తిరిగే కథలో ఉద్వేగం, భావోద్వేగాలు, స్నేహం, కుటుంబం, సవాళ్లు అన్ని కలిసి ఉండే అవకాశం ఉంది. ఇక బరి సినిమా పాన్-ఇండియా లెవల్ లో రూపొందుతోంది. వరుణ్ తేజ్ కు ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.












Click it and Unblock the Notifications