కోలీవుడ్ స్టార్ హీరోకు కోడలు కాబోతున్న కృతి శెట్టి?
ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది కృతి శెట్టి. ఆ తర్వాత వెంట వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు చిత్రాలతో మరో రెండు విజయాలు అందుకొని భారీ క్రేజ్ తెచ్చుకుంది. కానీ బంగార్రాజు తర్వాత మళ్లీ ఆమె హిట్ ముఖమే చూడలేదు. వరుసగా మూడు, నాలుగు ఫ్లాపులు పడటంతో తెలుగులో కృతి శెట్టికి ఆఫర్లు తగ్గిపోయాయి.
దీంతో తమిళ, మళయాళ భాషల్లో సినిమాలు చేస్తూ అక్కడ బిజీగా మారుతోంది. తాజాగా కృతిశెట్టికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరోకు కృతిశెట్టి కోడలు కాబోతోందనేది ఆ వార్త సారాంశం. ఆ హీరో ఎవరబ్బా? ఆయనకు అంత కొడుకున్నాడా? అతని పేరేంటి? అసలు ఈ వార్త నిజమేనా? అంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.

స్టార్ హీరోకు కోడులు కాబోతోందనేది నిజ జీవితంలోనేమోనని సినీ ప్రేమికులు చాలామంది అనుకున్నారు. కానీ వారందరినీ నిరాశ పరుస్తూ కేవలం సినిమాలోనే ఆ స్టార్ హీరోకు కృతిశెట్టి కోడలు కాబోతోందని తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. శర్వానంద్ కు ఇది 35వ చిత్రం. బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ కు తండ్రిగా ఓ కోలీవుడ్ హీరో నటించబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు విజయ్ సేతుపతి. ఇప్పటికే ఆయనకు స్టోరీ నచ్చడం.. సినిమా ఒప్పుకోవడం జరిగింది. విజయ్ సేతుపతి పాత్ర ఈ మూవీలో చాలా కీలకం కానుంది. ఇక శర్వానంద్ కు విజయ్ సేతుపతి తండ్రి అంటే.. కృతి శెట్టికి మామగారు. ఉప్పెనలో తండ్రీకూతుళ్లుగా నటించిన విజయ్, కృతి శెట్టి.. ఇప్పుడు శర్వా మూవీలో మామా, కోడలుగా నటించబోతున్నారు.












Click it and Unblock the Notifications