Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్ కు షాక్..! రూటు మార్చిన కేశినేని..!

విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada railway station) ను ఆధునీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆధునీకీకరణ కోసం రైల్వే పిలిచిన టెండర్లకు బిడ్డర్ల నుంచి స్పందన కరవైంది. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) ఇవాళ వెల్లడించారు. విజయవాడ నగరంలో పెండింగ్ లో ఉన్న రైల్వే పనులతో పాటు స్టేషన్ అభివృద్ధి విషయంలో చర్చించేందుకు ఆయన దక్షిణ కోస్తా రైల్వే జీఎం మాధుర్ ను కలిశారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.

విజయవాడలో చిరు వ్యాపారులకు పోలీసుల షాకులు..! రోడ్డుపై కనిపిస్తే..!
విజయవాడలో చిరు వ్యాపారులకు పోలీసుల షాకులు..! రోడ్డుపై కనిపిస్తే..!

విజయవాడ నగరంలో రైల్వే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నగరాన్ని దేశంలోనే ఆదర్శ రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని స్థాయిల్లో కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (kesineni chinni) తెలిపారు. ఇవాళ దక్షిణ కోస్తా రైల్వే జీఎం మాథుర్‌ను కలిసి విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలకు సంబంధించిన కీలక రైల్వే సమస్యలను వివరించినట్లు ఆయన తెలిపారు. విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎనిమిది రైల్వే ఓవర్ బ్రిడ్జిల (RoBలు) నిర్మాణంపై జీఎంతో చర్చించినట్లు తెలిపారు. ఎర్రకట్ట వంతెన పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ప్రజలకు అత్యంత కీలకమని, అలాగే గుణదల ఎల్‌సీ-8 వద్ద ఆర్వోబీ నిర్మాణం కూడా అత్యవసరమని స్పష్టం చేసినట్లు చెప్పారు.

Amrit Bharat revamp for Vijayawada railway station- tdp mp kesineni chinni asks centre after modernization setback
RRB Exam 2026: విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక రైళ్లు- తేదీలు, హాల్ట్ లు ఇవే..!
RRB Exam 2026: విజయవాడ-పలాస మధ్య ప్రత్యేక రైళ్లు- తేదీలు, హాల్ట్ లు ఇవే..!

మరోవైపు విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు టెండర్లు పిలిచినా స్పందన రాకపోవడం ఆందోళన కలిగించే అంశమని కేశినేని తెలిపారు. ఈ ప్రాజెక్టు వేగవంతం అయ్యేలా కేంద్ర రైల్వే శాఖతో ప్రత్యేకంగా చర్చిస్తామని వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రిని అన్ని ఎంపీలు కలిసి కోరనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ-బెంగళూరు (గుత్తి మీదుగా) కొత్త రైలు ప్రారంభించాలని రైల్వే మంత్రిని కోరనున్నట్లు చెప్పారు. అదేవిధంగా కొండపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+