ఉద్యోగులకు పీఆర్సీ - సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులతో చర్చల వేళ తీసుకున్న నిర్ణయాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డీఏల విడుదల పై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు పీఆర్సీ పైనా హామీ అమలుకు సిద్దమైంది. అందులో భాగంగా ఉద్యోగులకు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందు కోసం ఛైర్మన్ ను ఖరారు చేసారు. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ పైన కీలక నిర్ణయం తీసుకుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దినేశ్‌కుమార్‌ను నియమకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతభత్యాలు, సేవా నిబంధనల సవరణ కోసం ఈ కమిషన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 5వ తేదీన ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌తో సమావేశమైనప్పుడు పీఆర్‌సీకి చైర్మన్‌ను నియమిస్తామని సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వేతనాలను సమీక్షించి, పెరుగుతున్న జీవన వ్యయం, మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్ల కనీస, గరిష్ఠ వేతనాలను నిర్ణయించి ప్రభుత్వానికి పీఆర్‌సీ చైర్మన్‌ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వం వేతనాలు నిర్ణయించనుంది. కాగా.. కమిషన్ ఏర్పాటు తరువాత ఐఆర్ పైనా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిస్తున్నాయి.

కేంద్రంలో వారితో పొత్తుకు జగన్ సిద్దంగా ఉన్నారు - సాయిరెడ్డి..!!
కేంద్రంలో వారితో పొత్తుకు జగన్ సిద్దంగా ఉన్నారు - సాయిరెడ్డి..!!
ap-govt-is-considering-or-moving-to-appoint-retired-ias-officer-dinesh-kumar-as-the-12th-prc-chairma

ఉద్యోగులకు ఇచ్చిన హామీల పై కసరత్తు

ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వరుసగా నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ నియామక ఉత్తర్వుల్లో కీలక అంశాల పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ కమిషన్ కు గడువు పైనా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇప్పుడు పీఆర్సీ నియామకంతో కమిషన్ నివేదిక ఇచ్చి.. అమలు వరకు ఐఆర్ పైన ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. కాగా.. దినేశ్‌కుమార్‌ 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. 2017 మార్చి 31 నుంచి 2018 సెప్టెంబరు 30 వరకు రాష్ట్రానికి సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఏపీలో, కేంద్రలో అనేక కీలకమైన ఉన్నతపదవులు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌గా 2014 డిసెంబరులో నియమితులయ్యారు. అంతకుముందు ఆయన కేంద్ర ప్రభుత్వంలో జౌళి అభివృద్ధి కమిషనర్‌గా ఢిల్లీలో పనిచేశారు. రాష్ట్రప్రభుత్వం కొన్ని నెలల కిందట ఆయన్ను టీటీడీ నెయ్యి కల్తీ వివాదంపై విచారణకు ఏకసభ్య కమిటీ చైర్మన్‌గానూ నియమించింది. దీంతో.. ఇప్పుడు పీఆర్సీ ఛైర్మన్ గా దినేశ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+