నేటి నుంచి వాతావరణంలో భారీ మార్పులు!

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే నైరుతి రుతుపవనాల సీజన్ అధికారికంగా ముగిసింది. అయితే, ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కంటే దాదాపు 13 శాతం మేర తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి రుతుపవనాలు దేశం నుంచి క్రమంగా వెనక్కి తగ్గుముఖం పట్టాయి. నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న వేళ.. అక్టోబర్ మొదటి రోజున దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఒకవైపు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుంటే, మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం పొడి వాతావరణం కొనసాగనుంది.

దక్షిణాది రాష్ట్రాల్లో వరుణుడి ప్రభావం ఇంకా తగ్గలేదు. కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కేరళ, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో ముసురు వానలు పడే ఛాన్స్ ఉంది. ఇక తమిళనాడు, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలోని తుమకూరు జిల్లా కిబ్బనహళ్లిలో ఏకంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది.

October Weather Forecast South India Braces for Heavy Rains While North India Experiences Dry Spells

ఈశాన్యంలో అల్పపీడన ప్రభావం..

ఉత్తర మయన్మార్, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, మిజోరాం, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు కేరళ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు! ఈ వారంలోనే ప్యాకప్
నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు! ఈ వారంలోనే ప్యాకప్

ఉత్తరాదిలో ఎండల తీవ్రత

దక్షిణాది, ఈశాన్యంలో వానలు మురిపిస్తుంటే.. ఉత్తర - పశ్చిమ భారతదేశంలో మాత్రం పూర్తిగా పొడి వాతావరణం కొనసాగనుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఎండలు కాయనున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షం జాడ ఉండే అవకాశం లేదని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Monsoon 2026: ముగిసిన వర్షాకాలం- 13 శాతం లోటు- 2001 నుంచి నాలుగో అత్యల్పం..!
Monsoon 2026: ముగిసిన వర్షాకాలం- 13 శాతం లోటు- 2001 నుంచి నాలుగో అత్యల్పం..!

దేశం నుంచి పూర్తిగా వైదొలుగుతున్న రుతుపవనాలు

సాధారణంగా సెప్టెంబర్ మధ్యలో ఉత్తర-పశ్చిమ భారతదేశం నుంచి వెనక్కి తగ్గడం ప్రారంభించే రుతుపవనాలు, అక్టోబర్ మధ్య నాటికి దేశం పూర్తిగా వీడిపోతాయి. ప్రస్తుతం రుతుపవనాల తిరోగమన రేఖ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మీదుగా గుజరాత్ వరకు విస్తరించి ఉంది. రాబోయే రెండు మూడు రోజుల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్ నుంచి కూడా రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+