గన్నవరం ఎయిర్ పోర్టు ప్రయాణికులకు గుడ్ న్యూస్-కేశినేని చిన్ని కీలక ప్రకటనలు..!

విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కీలకంగా ఉన్న గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం(Vijayawada Airport)కు త్వరలో మహర్దశ పట్టనుంది. అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఎయిర్ పోర్టును కూడా అంతే స్దాయిలో అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి.

Prasna Ravan: రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్..!
Prasna Ravan: రావణ్ కు బిగుస్తున్న ఉచ్చు ?- ఏపీ సర్కార్ తాజా షాక్..!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేశీయ, అంతర్ విమాన సర్వీసుల విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం, విమానాశ్రయానికి మెరుగైన రహదారి అనుసంధానం వంటి అంశాలపై ఇవాళ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం చర్చించింది. అనంతరం ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కోచైర్మెన్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి ప్రాధాన్యం లభించిందన్నారు.

Vijayawada Airport Set for New Terminal by Dussehra Direct Dubai and Sri Lanka Flights on Cards
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్..! సుప్రీంకు ఏపీ సర్కార్..!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్..! సుప్రీంకు ఏపీ సర్కార్..!

విజయవాడ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్‌ను దసరా నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందన్నారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం కొచ్చిన్‌కు నేరుగా విమాన సర్వీస్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ముంబై తదితర నగరాలకు మరిన్ని విమాన సర్వీసులు అవసరమని కమిటీ అభిప్రాయపడిందని తెలిపారు. విజయవాడ నుంచి దుబాయ్‌కు, శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమైతే అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత పెరుగుతుందని కేశినేని వెల్లడించారు. అలాగే విజయవాడకు ఎమిరేట్స్ సర్వీస్ తీసుకురావాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు వారణాసి, కొచ్చిన్, గోవా, కోల్‌కతా, ముంబైకి మరిన్ని విమాన సర్వీసులు నడపాలని కమిటీ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+