రాజమౌళి సినిమా కోసం మహేష్‌బాబు రెమ్యునరేషన్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దాదాపుగా అవికూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజమౌళి అన్ని వివరాలను వెల్లడించబోతున్నారు. తెలుగులో ఉన్న స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మహేష్ బాబు మాత్రం తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు.

రాజమౌళితో చేసే సినిమాతో పాన్ ఇండియా కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నారు. ఒక సినిమా చేయడానికి మహేష్ బాబు దాదాపు రూ.80 నుంచి రూ.100 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటున్నారు. సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కోసారి ఏడాదిన్నరకో సినిమా విడుదల చేస్తుంటారు. రాజమౌళితో చేయబోయే సినిమాకు మూడు సంవత్సరాలు కేటాయించాలి. ఈ లెక్కన మూడు సినిమాలకు సంబంధించిన పారితోషికం తీసుకోవాలి. రూ.80 కోట్లు రెమ్యునరేషన్ అనుకున్నా.. మూడు సంవత్సరాలకు మూడు సినిమాల చొప్పున రూ.240 కోట్ల పారితోషికం తీసుకోవాలి.

mahesh babu remuneration details for rajamouli movie

అయితే ఈ సినిమాకు రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత అంతస్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చే నిర్మాతలు దొరకడంతోపాటు సినిమా తీయగలిగే దర్శకుడు కూడా కావాలి. కానీ అది అనుకున్నంత సులువైతే కాదు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోలంతా ఆ స్థాయి సినిమాలు చేయడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. మరి మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాత ఎవరితో చేస్తాడనేది మూడు సంవత్సరాల తర్వాతే తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+