'పెద్ది' మూవీ చూసిన మహేశ్ బాబు.. వెంటనే రామ్ చరణ్ కు కాల్ చేసి..!!
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో 'పెద్ది' మూవీ హవా నడుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పండగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి తర్వాత సరైన పెద్ద సినిమా లేక అటు థియేటర్లు వెలవెలబోయాయి. ఇటు ప్రేక్షకులు సైతం తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఇదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. చాలా రోజుల తర్వాత పెద్ది లాంటి పాన్ ఇండియా సినిమా రావడంతో అటు సాధారణ ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ది మూవీకి క్యూ కడుతున్నారు.
ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ, సందీప్ రెడ్డి వంగా బ్రదర్స్, రామ్ చరణ్ ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు మూవీని చూశారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా పెద్ది సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా చూసినట్లు సమాచారం. సినిమా అద్భుతంగా ఉందంటూ రామ్ చరణ్ కూ ఫోన్ చేసి మాట్లాడారట. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ గురించి కూడా బాగా మాట్లాడినట్లు సమాచారం. కూస్తీ ఫైట్స్ సీన్స్ లో రామ్ చరణ్ బాడీ అద్భుతంగా ఉందని.. అంత బాడీని బిల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదని.. రామ్ చరణ్ తో మహేశ్ బాబుతో చెప్పినట్లు సమాచారం.
అలాగే పెద్ది సినిమా క్లైమాక్స్ లో నటనతో ఏడిపించావ్ అంటూ మహేశ్ బాబు.. రామ్ చరణ్ తో దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక మహేశ్ బాబు, రామ్ చరణ్ చాలా సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు ఎప్పుడూ మాట్లాడుకుంటాయి. ఇక ప్రీమియర్ షూస్ నుంచే పెద్ది సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

పెద్ది మూవీ ప్రీమియర్స్ తోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇందులో ఇండియాలోనే రూ. 22 కోట్లు ఉన్నట్లు సమాచారం. అటు బుక్ మై షోలో ఇప్పటికే 10 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications