మెగాస్టార్‌కు తీవ్ర అనారోగ్యం..ఆస్పత్రికి తరలింపు
మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. దీంతో ఆయనకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ముమ్ముట్టి ఆరోగ్యం గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ముమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే ప్రచారం జరిగింది. అందుకే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా దీనిపై ముమ్ముట్టి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ క్లారిటీ ఇచ్చారు. ముమ్ముట్టికి క్యాన్సర్ అని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. ముమ్ముట్టి కేవలం చిన్న ఆరోగ్య సమస్యతోనే బాధపడుతున్నారని ఆయన వివరణ ఇచ్చారు.ప్రస్తుతం ముమ్ముట్టి చికిత్స తీసుకొంటున్నారని, త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తారని ఎంపీ జాన్ బ్రిట్టాస్ తెలిపారు.

క్యాన్సర్ అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, దయచేసి అలాంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. ముమ్ముట్టి త్వరలో పూర్తిగా కోలుకుని సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. ముమ్ముట్టి - మోహన్‌లాల్ కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా తెరకెక్కనుంది. మహేష్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ముమ్ముట్టి ఆరోగ్యం కుదటపడిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ముమ్ముట్టి ఆరోగ్యం బాగానేందని ఉందని విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications