విశాఖ- బెంగళూరు వందేభారత్ స్లీపర్ సిద్దం: రూట్, హాల్టింగ్ స్టేషన్లు, షెడ్యూల్..!!

రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి కొత్తగా వందేభారత్ స్లీపర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ నుంచి బెంగళూరుకు కొత్తగా వందేభారత్ స్లీపర్ ప్రారంభానికి రంగం సిద్దం అయింది. ఈ మేరకు ఇప్పటికే రూట్ తో పాటుగా టైమింగ్స్ ఖరారు చేసారు. రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైలు రాకపోకలకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముహూర్తం దాదాపు ఖరారైంది.

ఏపీ నుంచి కొత్తగా వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కనుంది. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల మీదుగా వందేభారత్ స్లీపర్ ఖరారు పైన పలు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. అయితే, నిత్యం రద్దీ గా ఉండటంతో పాటుగా డిమాండ్ ఉన్న విశాఖ - బెంగళూరు మధ్య ఈ కొత్త స్లీపర్ సర్వీసును కేటా యిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విశాఖ - బెంగళూరు మధ్య నిత్యం రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో ఎస్​ఎంవీబీ సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖలో బయల్దేరుతుంది.

తెలంగాణాకు రైల్వే భారీ వరాలు.. రూ.48వేల కోట్లతో 21 ప్రాజెక్టులు, లెక్క ఇదే!
తెలంగాణాకు రైల్వే భారీ వరాలు.. రూ.48వేల కోట్లతో 21 ప్రాజెక్టులు, లెక్క ఇదే!
Railways approves for new vandebhrat Sleeper between Visakha and Banglore Schedule here

మరుసటి రోజు ఉదయం 7గంటలకు బెంగళూరు చేరుతుంది. ప్రయాణ సమయం 18గంటల 30 నిమిషాలు గా ఉంది. అదే విధంగా బెంగళూరు నుంచి విశాఖకు నిత్యం ప్రయాణించే ప్రశాంతి ఎక్స్​ప్రెస్ మధ్యాహ్నం 1గంటలకు బెంగళూరులో ప్రారంభమై దాదాపు 22గంటల పాటు ప్రయాణిస్తుంది. దీంతో... ఈ రూట్ లో ఇప్పుడు కొత్తగా వందే భారత్ స్లీపర్ రావటంతో ప్రయాణం 14 గంటల్లోనే పూర్తి కానుంది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు కళ్లూ చాలట్లేదు: స్కైవాక్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. రెండు కళ్లూ చాలట్లేదు: స్కైవాక్

కాగా, ఈ రైలు షెడ్యూల్ దాదాపు ఖరారు చేసారు. ఈ రైలు సోమవారం మినహా మిగిలిన రోజుల్లో నడవనుంది. విశాఖ నుంచి రాత్రి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి దువ్వాడకు 8.45కు, కృష్ణాకెనాల్‌కు అర్ధరాత్రి 1.05కు, నంద్యాలకు తెల్లవారుజామున 4.40కి, ధర్మవరానికి 7.30కి, బెంగళూరుకు ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో బెంగళూరులో రాత్రి 8 గంటలకు బయలుదేరి ధర్మవరానికి 10.30కి, నంద్యాలకు అర్ధరాత్రి 1.02కి, కృష్ణాకెనాల్‌కు తెల్లవారుజాము 4.55కు, దువ్వాడకు 9.15కు, విశాఖపట్నానికి ఉదయం 10 గంటలకు చేరుకునే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు. వినాయక చవిత వేళ ఈ రైలు ప్రారంభానికి కసరత్తు జరుగుతోంది. అదే విధంగా త్వరలోనే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి మరో వందేభారత్ స్లీపర్ ప్రారంభం దిశగా కసరత్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+