బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: అగ్రవర్ణాలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి!

Kalvakuntla Kavitha: ఈ సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కవిత ప్రసంగించారు. సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రజలంతా ఒకే వేదికపై సంకల్పం చేస్తున్నారన్నారు. సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారని.. అందరూ సమానంగా పంచుకోవాలన్నదే సామాజిక న్యాయం అని చెప్పుకొచ్చారు. అగ్రవర్ణ మిత్రులు ఒక్కసారి ఆలోచించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

 కొత్త రేషన్ కార్డులు వీరికే, పంపిణీ ముహూర్తం - మార్గదర్శకాలు, ప్రభుత్వం ప్రకటన..!!
కొత్త రేషన్ కార్డులు వీరికే, పంపిణీ ముహూర్తం - మార్గదర్శకాలు, ప్రభుత్వం ప్రకటన..!!

వంద మందికి వంద రొట్టెలు ఉంటే తలా ఒకటి తింటే న్యాయం, ధర్మం.. కానీ 10 మంది బలవంతులు 90 రొట్టెలను తింటే.. మిగతా 90 మంది బలహీనులు 10 రొట్టెలు తినడం న్యాయమా, ధర్మమా? అంటూ కవిత ప్రశ్నించారు. ఇండియాలో ఏ మార్పు వచ్చిన అగ్రవర్ణాల్లోని ప్రజాస్వామ్యవాదులు కలిసి వచ్చిన ఆ మార్పులను తీసుకువచ్చారంటూ చెప్పుకొచ్చారు. క్షత్రియుడైన గౌతమ బుద్ధుడు చూపిన మార్గం, ఛత్రపతి సాహు మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన ఆశయాల స్ఫూర్తితో సమాజ శ్రేయస్సు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కవిత పిలుపునిచ్చారు. సమానత్వం, న్యాయం, భాగస్వామ్య అభివృద్ధే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని కవిత పేర్కొన్నారు.

Kalvakuntla Kavitha demands 50 reservation for BCs at Samajika Nyaya Sabha and addresses upper castes

సామాజిక న్యాయంపై కవితకు ఏం సంబంధమని కొందరు మాట్లాడుతున్నారని.. నేను అగ్రవర్ణంలో పుట్టానని... అది నా చేతుల్లో లేని పని అని.. కానీ నేను ఎలా జీవించాలి..ఎవరి కోసం పనిచేయాలనేదని మాత్రం నా చేతుల్లో ఉందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అందుకే అణగారిన వర్గాల కోసం సాధికారిత తెచ్చేవరకు జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్తున్న మన వారిపై అక్కడి వారు వివక్ష చూపుతుంటే దానిని మనం సహించలేకపోతున్నామని.. మరి మన పక్కనే ఉన్న వివక్షను తుడిచిపెట్టేయొద్దా అంటూ కవిత ప్రశ్నించారు. సాతంత్య్రం వచ్చిన నాడే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారో ఆనాడే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిఉంటే ఇప్పుడు ఇండియా అమెరికాతో పోటీ పడేదని తెలిపారు. మనలో ఆ మార్పు రావాలన్నారు. రాష్ట్రంలో 56 శాతం బీసీల జనాభా ఉంటే కాంగ్రెస్ పార్టీ 42 శాతం బిల్లు పెట్టిందని కవిత విమర్శలు గుప్పించారు.

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై బిగ్ న్యూస్!
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై బిగ్ న్యూస్!

సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో కల్వకంట్ల కవిత పలు తీర్మానాలు చేశారు. జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని, జయశంకర్ కు పద్మవిభూషణ్ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కోరుతూ కవిత తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అసలైన ఆశయాలు, సామాజిక న్యాయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా కవిత భారీ ఎత్తున ప్రతిజ్ఞా కార్యక్రమాలను చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+