సారీ చెప్పేందుకు భారత్ నో..! టోర్నీ నుంచి తప్పుకున్న పాకిస్తాన్..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. వీటి ప్రభావం క్రీడలపైనా తీవ్రంగానే ఉంది. ఇప్పటికే ఇరు జట్లూ తటస్థ వేదికలపై మ్యాచ్ లు ఆడుతున్నా.. కరచాలనం మాత్రం చేసుకోవడం లేదు. ఇలాంటి సమయంలో తాజాగా వెటరన్ క్రికెటర్లు ఆడుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2026) టోర్నీ నుంచి పాకిస్తాన్ అర్ధాంతరంగా తప్పుకుంది. దీనికి కారణం భారత్ రాతపూర్వకంగా సారీ చెప్పేందుకు నో చెప్పేయడమే.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ సందర్భంగా ఈ ఏడాది కూడా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) వివాదం తెరపైకి వచ్చింది. గత సీజన్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరించిన నేపథ్యంలో, భారత జట్టు నుంచి పాకిస్తాన్ రాతపూర్వక క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆ డిమాండ్‌ను టోర్నీ నిర్వాహకులు తిరస్కరించడంతో పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ఎన్డీటీవీ వర్గాలను ఉటంకిస్తూ నివేదికలు వెల్లడించాయి.

Pakistan Champions Pull Out of WCL Over Rejected Demand for Written Apology From Indian Players

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన గత WCL సీజన్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని భారత జట్టు నిర్ణయించింది. మొదట గ్రూప్ దశలో భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. అనంతరం సెమీఫైనల్లోనూ భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడేందుకు నిరాకరించింది. దీంతో పాకిస్థాన్ ఛాంపియన్స్‌కు వాకోవర్ లభించి ఫైనల్‌కు చేరుకుంది.ఇప్పుడు WCL సీజన్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు ఎన్వోసీలు ఇవ్వడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలుత ఆసక్తి చూపలేదు. అయితే తర్వాత అంగీకరించినప్పటికీ, ఒక షరతు పెట్టింది. గత సీజన్‌లో భారత జట్టు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి రాతపూర్వక క్షమాపణ ఇప్పించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్‌ను నిర్వాహకులు తిరస్కరించారు. అలాగే భారత్ ఈ టోర్నీలో ఆడకూడదని నిర్ణయించుకున్నా నిర్వాహకులకు ఎలాంటి అభ్యంతరం ఉండదనే హామీ కూడా అడిగింది. దానిపైనా అంగీకారం కుదరలేదు. దీంతో పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి తప్పుకోవడాన్ని నిర్వాహకులు అనూహ్య పరిస్థితులే కారణంగా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+