నల్ల సముద్రంలో రష్యా డ్రోన్లతో విధ్వంసం.. భారత నావికులున్న నౌకపై దాడి
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య డ్రోన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్ లోని సుమీ నగరంలో భారత కంపెనీకి చెందిన కుసుమ్ గ్రూప్ ఫార్మా ప్లాంట్ పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒకరు మృతిచెందగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనను మరువకముందే నల్ల సముద్రంలో టర్కీకి చెందిన సరకు రవాణా నౌకపై రష్యా డ్రోన్ లు విరుచుకుపడ్డాయి. ఈ నౌకలో అజర్ బైజాన్, భారతీయ నావికులే ఉన్నారు. వారిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో నౌక కెప్టెన్ ఉన్నారు. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక నౌకలోని మిగతా 11 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రోయడ్ మమ్మాదోవ్ అనే పేరు కలిగిన నౌక ఉక్రెయిన్ నుంచి మొక్కజొన్న సరుకును ఇటలీకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు మెరైన్ ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
A horrific strike by two Russian drones on a civilian vessel in neutral waters carrying corn and owned by Türkiye. Azerbaijani and Indian citizens were on board. As of now, unfortunately, we know that the ship’s captain was killed. My condolences. The fate of one other person is still being established. Eleven crew members were rescued, one of them injured.Ukraine has repeatedly proposed concrete steps to de-escalate the situation and ensure security in the Black Sea. There have also been relevant proposals from third countries. But Russia consistently chooses terror and sinking civilian vessels instead of normal maritime navigation. Pressure is needed to restore global food security. And everyone who is genuinely interested in this must help.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) October 5, 2026
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇదే విషయంపై ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రష్యా డ్రోన్ దాడిలో నల్ల సముద్రంలో ఓ వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆ నౌక నీటిలో మునిగిపోయింది అని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. ప్రజా నౌకపై రెండు రష్యన్ డ్రోన్ లు ఇలా దాడులు చేయడం ఎంతో ఘోరమైన ఘటన అని మండిపడ్డారు. ఈ నౌక టర్కీకి చెందినదని.. మొక్క జొన్న సరుకును రవాణా చేస్తోందని తెలిపారు. అయితే ఈ ఘటనపై రష్యా నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. నల్లసముద్రంలో ఇలాంటి ఘటనలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రష్యా మాత్రం టెర్రర్ దాడులను కొనసాగిస్తూనే ఉందన్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కోసం రష్యాపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

ఇదే ఘటనపై రోమానియాకు చెందిన నేవల్ అథారిటీ స్పందిస్తూ.. రోయడ్ మమ్మదోవ్ అనే నౌకపై రష్యా డ్రోన్లు దాడులు జరిపాయని పేర్కొంది. అలాగే షిప్పింగ్ వెబ్ సైట్ మెరైన్ ట్రాఫిక్ లో మ్యాప్ ప్రకారం.. ఈ వాణిజ్య నౌక ఉక్రెయిన్ లోని ఇజ్ మెయిల్ పోర్ట్ నుంచి ఇటలీలోని సెయింట్ కిట్టిస్, నెవిస్ ప్రాంతాలకు బయల్దేరింది. ఇక రష్యా డ్రోన్ దాడిలో ఇప్పటివరకూ 11 మందిని సురక్షితంగా కాపాడారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్టింగ్ చేసి ఆస్పత్రులకు తరించినట్లు తెలుస్తోంది. ఇక నల్ల సముద్రం ప్రపంచ వాణిజ్య రవాణాకు కీలకమైనదిగా ఉంది. కానీ 2022 నుంచి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడంతో ఈ నల్ల సముద్రంపై భద్రతా పరమైన ఆందోళనలు అధికం అయ్యాయి.












Click it and Unblock the Notifications
