ACB raids: ఏసీబీకి చిక్కిన‌ టౌన్ ప్లానింగ్ సూపర్‌ వైజర్, డీఎంహెచ్‌వో

రాష్ట్రంలో ఇటీవ‌ల అవినీతి అధికారులు భారీ సంఖ్యలో ఏసీబీకి ప‌ట్టుబ‌డుతున్నసంగతి తెలిసిందే. కానీ అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావ‌డం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకో అధికారి ఎక్కడో ఓ చోట ఏసీబీ అధికారులకు చిక్కతూనే ఉన్నారు. తాజాగా గోల్గొండ జోన్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ తులసీ రామ్ సునీత ఏసీబీకి చిక్కారు. ఓ భవన నిర్మాణానికి సహకరించేందుకు రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. అయితే చివరకు రూ. 6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో తొలి విడతగా రూ. 4 లక్షలు తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు తులసీ రామ్ సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమె నుంచి రూ. 4 లక్షలు లంచం సొమ్మును రికవరీ చేశారు. అలాగే సోదాల సమయంలో లెక్కల్లో చూపని మరో రూ.2.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ తులసీ రామ్ సునీత తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా అనుచిత లబ్ది పొందేందుకు యత్నించినందుకుగాను ఆమెపై ఏసీబీ అధికారులు చట్టపరమైన కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నిందితురాలిని నాంపల్లిలోని అడిషనల్ ప్రత్యేక జడ్జి ముందు హాజరుపర్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున భద్రతా కారణాల రీత్యా ఫిర్యాదుదారు వివరాలను వెల్లడించడం లేదని స్పష్టం చేశారు. ఇదే రోజు అంతకుముందు రంగారెడ్డి జిల్లా DMHO స్వ‌ర్ణ‌ కుమారి ఏసీబీ వ‌ల‌కు చిక్కారు. ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించేందుకు రూ. 2 ల‌క్ష‌ల‌ లంచం డిమాండ్ చేశారు.

ACB Town Planning Supervisor caught 4 lakh bribe separate incident female DMHO official also nabbed

అయితే రూ. 2 లక్షల్లో భాగంగా రూ. 1 లక్ష ఇవ్వాలని స్వర్ణకుమారి కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మొదటగా బాధితుడు రూ. లక్షను హెల్త్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ కు అందజేశాడు. ఆ తర్వాత ఆ నగదును డీఎంహెచ్ఓ డ్రైవర్ కృష్ణయ్యకు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులను కారులో పెట్టేందుకు వెళ్తున్న సమయంలో కృష్ణయ్యను పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే దర్యాప్తులో వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+