మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నెలకు సగటున 11 కోట్లకు పైగా ప్రయాణాలు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆదరణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళలు నీరాజనాలు పట్టారని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. గత 3 నెలల్లో అదనంగా 97.20 లక్షల మంది ప్రయాణించారని.. దాంతో డిమాండ్‌ మేరకు ప్రత్యేక సర్వీసులు, ట్రిప్పుల సంఖ్య పెంచుతామని, గతేడాదితో పోలిస్తే జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు. ఇక గణాంకాలు చూస్తే గత మూడు నెలల్లోనే 35.65 కోట్ల మహిళలు ప్రయాణం చేశారు. గతేడాది కంటే 97.20 లక్షల అదనపు ప్రయాణాలు జరిగాయి. ఈ మేరకు రద్దీకి తగ్గట్లుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ఇంటర్‌ డిస్ట్రిక్ట్ మార్గాల్లో ట్రిప్పులను ఆర్టీసీ పెంచింది.

తాజాగా మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ఆర్టీసీ కీలక వివరాలను వెల్లడించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు గతేడాది ఇవే మూడు నెలలతో పోల్చితే ఈ మూడు నెలల కాలంలోనే అదనంగా దాదాపు కోటి మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారని తెలిపింది. ఈ మేరకు అందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది.2025 జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 3,467.91 లక్షల (34.67 కోట్లు) ప్రమాణాలు నమోదు అయ్యాయి. అయితే 2026లో ఇదే మూడు నెలల కాలానికి ఆ సంఖ్య 3,565.11 లక్షలకు (35.65 కోట్లు) చేరింది. అలాగే ఈ ఏడాది ఆగస్టు నెలలో అధికంగా ప్రయాణాలు జరిగినట్లు పేర్కొంది. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టులో 48.27 లక్షల ప్రయాణాలు అదనంగా నమోదయ్యాయి.

Mahalakshmi free bus travel scheme Telangana RTC releases key statistics Telangana free bus scheme

పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, రాజధాని కనెక్టివిటీ అలాగే ఉత్తర తెలంగాణ, కరీంనగర్ రీజియన్ ప్రాంతాల్లో, వరంగల్, నల్గొండ రూట్లలో, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాలతోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో బస్సుల సంఖ్యను పెంచింది. ఇక తెలంగాణలో ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన బాలికలు, అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్‌ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+