ఘోర పడవ ప్రమాదం.. 30 మందికిపైగా మృతి.. డజన్లమంది గల్లంతు

ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కాంగో నదిలో ప్రమాదవశాత్తూ రెండు పడవలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రయాణికులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని కాంగోలోని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. కాంగోలోని ఈక్వేటియర్ ప్రావిన్స్ లోని గోంబే- లూకోలేలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రెండు మోటరైజ్డ్ బోట్స్ ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటన అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఇదే విషయాన్ని ఈక్వేటియర్ ప్రావిన్షియల్ ఇంటీరియర్ మినిస్టర్ క్రిస్పిన్ ఎంపుటూ వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. రాత్రి పూట పడవ ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ కు ఆయన వివరించారు.

ఈ ప్రమాదానికి ముందు ఒక పడవ ఉబాంగి నుంచి నార్త్ వెస్ట్ నుంచి కాంగో రాజధాని కిన్ షాషాకు వెళ్తుందని మరో పడవ కిన్ షాషా నుంచి లూకోలేలాకు వెళ్తుందని ఇంటీరియర్ మినిస్టర్ క్రిస్పిన్ ఎంపుటూ తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం అయ్యాయని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై సెక్యూరిటీ ఫోర్సెస్ కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తాను నది ఒడ్డు నుంచి ఈ ప్రమాద ఘటనను చూశానని తెలిపాడు. ఉబాంగి నుంచి రిటర్న్ అయిన ఓ పడవ అధిక లోడ్, ప్రయాణికులతో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిన్ షాషా నుంచి వస్తున్న మరో పడవను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పడవలోని అందరు ప్రయాణికులు నీటిలో చిక్కుకుపోయారు. అలాగే పడవ కూడా మునిగిపోయింది.. అని ఏపీ న్యూస్ కు వివరించాడు.

Congo Horrific boat accident in Congo Over 30 dead dozens missing Over 30 dead dozens missing

ఇక సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో ఇలాంటి పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. లేట్ నైట్ ట్రావెల్, ఓవర్ లోడ్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. అలాగే నాణ్యమైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం.. మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండటం కారణంగా ఇలాంటి పడవ ప్రమాదాల్లో వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే ఏడాది జూలైలో కాంగోలో ఓ చెక్క పడవ విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదవశాత్తు మునిగింది. 20 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+