ఫ్లై దుబాయి తరహాలోనే మరో ఘటన..! నిమిషాల్లో 28 వేల అడుగులు కిందకు ఫ్లైట్..!

తాజాగా దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు బయలుదేరిన ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్ పై కో పైలట్ దాడితో ఫ్లైట్ వేల అడుగులు కిందకు జారిపోయిన ఘటన మర్చిపోక ముందే.. ఇవాళ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈసారి లండన్ నుంచి చికాగోకు వెళ్తున్న బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం( British Airways Flight) ఇలా అత్యవసర పరిస్ధితుల నేపథ్యంలో నిమిషాల వ్యవధిలోనే 28 వేల అడుగుల కిందకు జారిపోయింది.

Flydubai: భారతీయ పైలట్ పై దాడి చేసిన కో పైలట్ కు ఉరిశిక్ష ?
Flydubai: భారతీయ పైలట్ పై దాడి చేసిన కో పైలట్ కు ఉరిశిక్ష ?

యూకే మీడియా ఫ్లైట్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. లండన్ నుండి చికాగో వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం ఐర్లాండ్ గగనతలంపై నుంచి ప్రయాణిస్తుండగా.. సుమారు 28వేల అడుగుల ఎత్తుకు అకస్మాత్తుగా పడిపోయింది. దీంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. లండన్ హీత్రూ నుండి చికాగోలోని ఓ'హేర్‌కు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ BA295.. ఐర్లాండ్‌పై ఎగురుతున్నప్పుడు అంతర్జాతీయ అత్యవసర ట్రాన్స్‌పాండర్ కోడ్ అయిన 7700 హెచ్చరికలు పంపింది. ఈ విమానం సుమారు ఎనిమిది గంటల 40 నిమిషాల ప్రయాణంలో భాగంగా ఉదయం 11.50 గంటలకు (స్థానిక సమయం) హీత్రూలోని టెర్మినల్ 5 నుండి బయలుదేరి చికాగో వైపు వెళ్తోంది. ఫ్లైట్-ట్రాకింగ్ డేటా ప్రకారం, ఈ విమానం సుమారు 37 వేల అడుగుల ఎత్తులో వెళ్తోంది. కానీ ఐర్లాండ్ గగనతలంలోకి వచ్చాక ఇది సుమారు 9,000 అడుగుల ఎత్తుకు దిగిపోయింది.

British Airways Flight Issues Emergency Alert Over Ireland After Rapid 28 000-Ft Descent
Flydubai:
Flydubai:

దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అనంతరం చికాగో వెళ్లాల్సిన ప్రయాణం రద్దు చేసుకుని తిరిగి లండన్ వైపు మళ్లింది. అయితే బ్రిస్టల్ ఛానల్ పై చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అత్యవసర పరిస్థితికి గల కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు. విమానం అట్లాంటిక్ మీదుగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సుమారు గంట తర్వాత, అది వేగంగా కిందికి దిగడం మొదలుపెట్టింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఈ సంఘటన గురించి తక్షణమే వివరాలు అందించలేదు. అలాగే విమానాన్ని మళ్లించడానికి గల కారణాన్ని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+