పుష్ప సినిమాలో ఆ పాత్ర నేనే చేయాల్సింది.. కానీ ! - నారా రోహిత్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు "నారా రోహిత్". సీఎం చంద్రబాబు సోదరుడి కుమారుడుగా గుర్తింపు పొందిన రోహిత్.. బాణం మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సోలో (2011), ప్రతినిధి (2014), రౌడి ఫెలో (2014), అసుర (2015), అప్పట్లో ఒకడుండేవాడు (2016) వంటి విలక్షణమైన చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలానే జ్యో అచ్యుతానంద, సావిత్రి, కథలో రాజకుమారి వంటి సినిమాలు కూడా ఆయన కెరీర్‌లో ప్రత్యేకస్థానం సంపాదించాయి. రీసెంట్ గా వచ్చిన ప్రతినిధి 2 డిజాస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి రికార్డులు కొల్లగొట్టిన పుష్ప చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను తాను చేయాల్సింది అని.. కానీ పలు కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయ్యిందని వ్యాఖ్యానించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రోహిత్ ఏమన్నారంటే.. తనను పుష్ప సినిమాలోని ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కోసం ముందు అడిగారని.. కొవిడ్ సమయంలో మీసాలతో ఒక ఫొటోను సిద్ధం చేసి నాకు పంపారు అని తెలిపారు. నిర్మాత కూడా ఆ పాత్ర గురించి తనతో మాట్లాడారని వివరించారు. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ సైతం చర్చించారని.. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి కాబట్టి.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రలో ఫహాద్ ఫాజిల్‌ను తీసుకున్నారని చెప్పారు.
భైరవం మూవీ తమిళంలో హిట్ కొట్టిన 'గరుడన్' సినిమాకు రీమేక్ గా రాబోతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. అందులో శశి కుమార్ చేసిన పాత్రను నారా రోహిత్ పోషిస్తున్నారు.
మరోవైపు భైరవం చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో.. ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడు ఎవరోకరు వస్తూనే ఉంటారు. సరిగ్గా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒకరు వచ్చారు. అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడాడానికి మా కాల భైరవులు వచ్చి ధర్మాన్ని కాపాడతారు అంటూ డైరెక్టర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అలానే 2011 లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ను ట్రోల్ చేస్తూ విజయ్ కనకమేడల పెట్టిన పోస్టులను ఇప్పుడు వైరల్ చేస్తూ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వ్యవహరం సర్దుమనిగినట్టు కనిపించడం లేదు. రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో అయిన వీటికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications