Pradeep Rawat: 150 కు పైగా సినిమాలు.. 'భిక్షూ యాదవ్' ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

సాధారణంగా చాలామంది సినీ ప్రియులు హీరోలను, హీరోయిన్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం కానీ హీరోలకు ధీటుగా విలనిజం పండించి విభిన్నమైన నటనతో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నవాళ్లు తక్కువ మందే ఉంటారు. వారిలో ఒకరు ప్రదీప్ రావత్.. ప్రదీప్ రావత్ అంటే చాలా మందికి తెలియదు.. భిక్షూ యాదవ్ అనగానే టక్కున గుర్తు పట్టేస్తారు. సినీ పరిశ్రమలో హీరోలకు క్రేజ్ మామూలుగా ఉండదు. కానీ విలన్ లకూ ఆ స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చిన నటుడు ప్రదీప్ రావత్. ఆయన ఆగస్టు 4 రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటుగా భావించాలి.

74 ఏళ్ల ప్రదీప్ రావత్ తన కెరీర్ లో దాదాపు 150కు పైగా సినిమాలు చేశారు. ఆయన విలన్ గా చేసిన సినిమాలే ఎక్కువ. అందులో అందరికీ టక్కున గుర్తొచ్చేది తెలుగులో ఆయన నటించిన తొలి సినిమా 'సై'.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2004 లో వచ్చిన ఈ మూవీలో భిక్షూ యాదవ్ పాత్రలో ఆయన జీవించేశారు. ఆయన కోసమే భిక్షూ యాదవ్ పాత్ర పుట్టుకొచ్చినట్లుగా రాజమౌళి డిజెన్ చేశారు. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోల కంటే విలన్లకే ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. భిక్షూ యాదవ్ పాత్ర తర్వాత ప్రదీప్ రావత్ పేరును అందరూ మర్చి పోయారు.

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. సినీ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత
టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. సినీ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత

సై సినిమా తర్వాత తెలుగులో బెస్ట్ విలన్ గా ఆయన అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. 2005 లో గజిని సినిమాలో విలన్ గా అదరగొట్టారు. ఆ తర్వాత వరుసగా భద్ర, ఛత్రపతి, లక్ష్మి, స్టాలిన్, దేశముదురు, యోగి, జగడం తదితర చిత్రాల్లో నటించారు. ఇటీవలి కాలంలో సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, కాటమరాయుడు, జై లవకుశ, వాల్తేరు వీరయ్య, గాయపడ్డ సింహం తదితర చిత్రాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ పట్టణంలో జన్మించిన ఆయన టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ విలన్ గా ప్రశంసలు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, ఇతర భాషల్లోనూ నటించారు.

PradeepRawat the assets of Tollywood actor who has acted in over 150 movies Pradeep Rawat assets

దాదాపు 150 కు పైగా సినిమాల్లో నటించిన ప్రదీప్ రావత్ ఆస్తుల విలువ రూ.41 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆయన రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారని తెలుస్తోంది. ప్రదీప్ రావత్ కు భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన అకాల మరణంతో సినీ అభిమానులు, సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. చివరి చూపు కోసం ఆయన దేహాన్ని ముంబై గోరేగావ్‌లోని నివాసంలో ఉంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+