'మా' అసోసియేషన్ సంచలనం.. నయనతారకు భారీ ఫైన్?

దక్షిణ భారతదేశంలో నయనతార అత్యంత ఖరీదైన హీరోయిన్లలో ఒకరు. సినిమాకు రూ.10 కోట్లనుంచి రూ.12 కోట్ల పారితోషికం తీసుకునేవారు. జవాన్ చిత్రం బాలీవుడ్ లో సంచలన విజయం అందుకోవడంతో ప్రస్తుతం తన పారితోషికాన్ని రూ.15 కోట్లకు పెంచారు. అన్ని పరిశ్రమల్లో అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అవడమే కాకుండా లేడీ డాన్, లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారు. తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలందరితో నటించారు.

షూటింగ్ నిలిపివేయించిన మురళీమోహన్
నాగార్జునతో బాస్ సినిమా చేసే సమయలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మురళీమోహన్ ఉన్నారు. ఆ సినిమాలోహీరోయిన్ గా నటిస్తున్న నయనతారకు మాలో సభ్యత్వ కార్డు లేకపోవడంతో తీసుకోవాలని సూచించారు. అయినా తీసుకోకపోవడంతో ఆమెకు మాలో సభ్యత్వం లేదనే కారణంతో షూటింగ్ ను నిలిపివేయించారు. మా అసోసియేషన్ లో కార్డు తీసుకున్నవారికే సినిమాల్లో అవకాశాలు రావాలన్న ఉద్దేశంతో ఆయన అలా వ్యవహరించారు. కార్డు తీసుకోకుండా నటిస్తోంది కాబట్టి ఆమెకు మురళీమోహన్ ఫైన్ విధించారు.

Nayanthara was fined by movie artists association

నచ్చచెప్పిన నాగార్జున
ఫైన్ కట్టను అంటూ నయనతార తెగేసి చెప్పింది. దీనిపై నాగార్జున ఆమెతో మాట్లాడారు. డబ్బుల కోసం చూసుకుంటే తెలుగులో కెరీర్ సజావుగా సాగదని, కాంట్రవర్సీలో ఇరుక్కుంటే అవకాశాలు కూడా రావని నాగార్జున ఆమెకు నచ్చచెప్పారు. అనవసర వివాదాలుంటే సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గుముఖం పడతాయని, అటువంటివేవీ పెట్టుకోవద్దని, డబ్బులు కట్టేయాలంటూ సూచించి ఆమెచేత ఫైన్ కట్టించారు. ఫైన్ కట్టే విషయంలో నయనతార ఫైర్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ సంఘటన తర్వాత తెలుగు, తమిళ పరిశ్రమల్లో నయనతార స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+