పీరియడ్స్ ఫొటోలను లీక్ చేసిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన నిహారిక, ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'ఒక మనస్సు', 'సూర్యకాంతం', 'హ్యాపీ వెడ్డింగ్' వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకుంది.
పెళ్లి పీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నిహారిక, తిరిగి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో నిహారిక ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. గతేడాది ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఇదే సమయంలో నిహారిక నిర్మించిన సినిమా పలు అవార్టులను కూడా సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం 'కమిటీ కుర్రాళ్లు''సినిమాను గద్దర్ అవార్డుతో సత్కరించారు. ప్రస్తుతం నిహారిక తన రెండో సినిమాను తెరకెక్కించే పనిలో పడింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక, తాజాగా మహిళలకు సంబంధించిన విషయాన్ని షేర్ చేసింది. మహిళలు పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించిన విషయాన్ని వెల్లడించింది. 'డియర్ లేడీస్.. మహిళల శరీరం చాలా అందమైనది. మన బాడీస్‌కు ఏం చేస్తున్నామో తెలుసు. వాటి ఒకే ఒక్క జాబ్ ప్రొటెక్ట్ చేయడం, హీల్ చేయడం. మనం నెల మొత్తంలో ఒకేలా కనిపించలేం. హైయెస్ట్ హైస్, లోయెస్ట్ లోస్ ఫేస్ చేయడం సహజం. మీ బాడీ ఏం కోరుకుంటుందో అది ఇవ్వండంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications