మాట తప్పిన ఎన్టీఆర్..వేడుకుంటున్న అభిమాని తల్లి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. మాస్ డైలాగులు చెప్పడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇక డ్యాన్స్‌ల్లో కూడా ఎన్టీఆర్ అదరగోడుతుంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్‌ను సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవలే ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి కామెంట్స్ చేశారు. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పడం జరిగింది. ''ఆర్ఆర్ఆర్'' సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన 'దేవర' చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన సత్తాను చాటారు. మొదట్లో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది దేవర. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినాను మరోసారి నిరూపించింది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దేవర విడుదల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమానికి ఎన్టీఆర్ మాటిచ్చారు. క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలోలో చేరిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్. 'దేవర' సినిమా చూసి చనిపోవాలని, తన చివరి కోరిక అదే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కౌశిక్.ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌కు వీడియో కాల్ చేసి పరామర్శించారు.
అబ్బాయి చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తానంటూ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదంటున్న అభిమాని తల్లి సరస్వతి.మరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి ఉండడంతో అవస్థలు పడుతున్న బాధిత కుటుంబం. మరి దీనిపై ఎన్టీఆర్ ఇప్పటికైన రియాక్ట్ అయి రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.












Click it and Unblock the Notifications