ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్టీఆర్..అభిమాని కోసం రంగంలోకి
ఎన్టీఆర్ 'దేవర' సినిమా విడుదల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమానికి ఎన్టీఆర్ మాటిచ్చారు. క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలోలో చేరిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్. 'దేవర' సినిమా చూసి చనిపోవాలని, తన చివరి కోరిక అదే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కౌశిక్.ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్‌కు వీడియో కాల్ చేసి పరామర్శించారు. కౌశిక్ చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తానంటూ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది.
కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదంటున్న అభిమాని తల్లి సరస్వతి.మరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి ఉండడంతో అవస్థలు పడుతున్న బాధిత కుటుంబం. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, వెంటనే దీనికి సంబంధించిన ఫీజు మొత్తం చెల్లించారు.తన టీమ్‌తో మాట్లాడి అభిమాని యోగక్షేమాలను ఎన్టీఆర్ తెలుసుకున్నారు. అనంతరం దగ్గరుండి తన టీమ్ చేత డిశ్చార్జ్ చేయించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలుడు కౌశిక్ డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్నితల్లి సరస్వతి సైతం ధృవీకరించారు. తాను ఎక్కడా ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని, ఎన్టీఆర్ తమకు సాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకున్నారని ఆమె తెలిపారు.

ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే..''ఆర్ఆర్ఆర్'' సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన 'దేవర' చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన సత్తాను చాటారు. మొదట్లో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది దేవర. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఎన్టీఆర్ ప్రస్తుతం war-2 సినిమాలో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications