ఎన్టీఆర్ నోట సీఎం జగన్ డైలాగ్
సిద్దు జొన్నలగడ్డ చేసింది తక్కువ సినిమాలే అయిన ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా డీజే టిల్లు సినిమాతో యూత్‌లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. డీజే టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీలో డీజే టిల్లు సినిమా ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం అభిమానులపై ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ కావడంతో డీజే టిల్లు సీక్వెల్‌ను తెరకెక్కించారు. అనుమప పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా గత నెల 29న విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటివారంలోనే 100 కోట్ల గ్రాస్ సాధించి క్లీన్ హిట్‌గా నిలిచింది. మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో సోమవారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.

ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తనశైలికి భిన్నంగా మాట్లాడారు. తన సినిమాల గురించి ఎన్టీఆర్ పెద్దగా స్టేజ్‌ల మీద మాట్లాడరు. అయితే టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో మాత్రం తన కొత్త సినిమా దేవర గురించి స్పందించారు. ''ఇంచుమించు భయం గురించి మాట్లాడటం జరుగుతుంది.. కల కనడానికి ఒక ధైర్యం ఉండాలి.. దాన్ని సార్థకం చేసుకోవడానికి భయం ఉండాలి''.. అని దేవరలోని ఓ డైలాగ్ చెప్పారాయన.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ గతంలో ఏపీ సీఎం జగన్ చెప్పిన డైలాగ్‌ను ఒకటి చెప్పారు. సీఎం జగన్ గతంలో మాట్లాడుతూ.. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే కార్యకర్తలు తలెత్తుకుని కాలర్ ఎగరేసేలా ఉండాలని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో కూడా సరిగ్గా ఇదే డైలాగ్‌ను ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. దేవర అనే చిత్రం లేట్ అయినా కూడా అభిమానులు కాలర్ ఎగిరేసేలానే ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ కావాలని చెప్పారో లేక యాదృశ్చికంగా చెప్పారో తెలియదు కానీ.. సీఎం జగన్ చెప్పిన డైలాగ్ ఎన్టీఆర్ నోటి నుంచి రావడంతో అక్కడున్న వారంతా కూడా షాక్ అయ్యారు. ఇదే ఇప్పుడు సినీ , రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications