ఏపీ ఎన్నికల వేళ రూ.200 కోట్లు కేటాయించిన ప్రభాస్!
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. రాజకీయ పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ.. కచ్చితంగా అధికారాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రయత్నాలు చేస్తున్నాయి. సినీతారలకు ఉన్న గ్లామర్ ను వాడుకోవాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఉన్నాయి. అయితే తమకు అభిమానులు అన్ని పార్టీల్లోను ఉంటారు కాబట్టి స్టార్ హీరెలవరూ రాజకీయాల జోలికి వెళ్లడంలేదు. దీనివల్ల తమ కెరీర్ దెబ్బతినడంతోపాటు అభిమానులపరంగా వెనకబడిపోతామని భావిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ లాంటివారు తెలుగుదేశం పార్టీ అని అందరికీ కచ్చితంగా తెలిసిందే. అలా కాకుండా మిగతా హీరోలు ఏ పార్టీకి మద్దతిస్తారో అని రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు అంచనా వేస్తుంటారుకానీ వారంతా మౌనంగానే ఉన్నారు. పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. దీంతో సహజంగా అందరూ ప్రభాస్ బీజేపీకి మద్దతిస్తారేమోననే అంచనాలో ఉన్నారు. అయితే ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రభాస్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

కాకపోతే రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఎన్నికల కోణంలోనే చూస్తున్నారు. తన సొంత గ్రామం మొగల్తూరులో రూ.200 కోట్లు వ్యయం చేసి రోడ్లు నిర్మించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే తోటి నటీనటులందరికీ తానే స్వయంగా భోజనం తెప్పించి వడ్డించేవారు. మంచి మనస్తత్వం కలిగిన ప్రభాస్ తన సొంత ఊరిలో రోడ్లు వేయించనుండటంతో అది ఏ పార్టీకి ప్లస్ అవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండానే డార్లింగ్ తీసుకున్న నిర్ణయమైనప్పటికీ ఏ పార్టీకా పార్టీ తనకు అనుకూలంగా అన్వయించుకునే పరిస్థితి ఉంది.












Click it and Unblock the Notifications