‘అర్జున’గా పవర్ స్టార్.. ముగ్గురు స్టార్ డైరెక్టర్ల పోటీ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో మరో భార చిత్రం తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'వకీల్ సాబ్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సమయాల్లోనే పవన్ కల్యాణ్‌తో మరో సినిమా చేస్తానని ప్రకటించిన దిల్ రాజు, ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన సహా ప్రాథమిక పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

విశ్వక్ సేన్ 'కల్ట్’ విధ్వంసం షురూ.. ట్రైలర్‌తో అంచనాలు డబుల్!
విశ్వక్ సేన్ 'కల్ట్’ విధ్వంసం షురూ.. ట్రైలర్‌తో అంచనాలు డబుల్!

'ఓజీ2' తర్వాత మరో బిగ్ అప్‌డేట్
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఓజీ2' సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానికి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా డైరెక్టర్ ఇటీవల విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించబోయే కొత్త సినిమా వార్త అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం 'అర్జున' అనే పవర్‌ఫుల్ టైటిల్ ను నిర్మాతలు ఇప్పటికే రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan - Dil Raju Movie Titled Arjuna 3 Top Directors in Race to Direct Full Details Here

డైరెక్షన్ రేసులో త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి
ఈ భారీ సినిమాను తెరకెక్కించే అవకాశం కోసం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు టాప్ డైరెక్టర్లు పోటీ పడుతుండటం గమనార్హం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టైలిష్ మేకర్ వంశీ పైడిపల్లి పేర్లు ఈ ప్రాజెక్టు కోసం బలంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు డైరెక్టర్లతోనూ దిల్ రాజుకు మంచి అనుబంధం ఉంది. దీంతో పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఈ ముగ్గురిలో ఎవరు దక్కించుకుంటారోనన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!
నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!

హీరోయిన్లుగా కీర్తి సురేష్, రుక్మిణి వసంత్?
ఇక ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపికపై కూడా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు కన్నడ భామ రుక్మిణి వసంత్‌లను కథానాయికలుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులో పనిచేయబోయే డైరెక్టర్, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించిన పూర్తి వివరాలు వెల్లడి కావాలంటే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+