నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వైవిధ్యభరిత చిత్రం 'రాయవలస'. కార్తీక్ జయంతి, శ్రీష నులు జంటగా పరిచయమవుతున్న ఈ గ్రామీణ నేపథ్య చిత్రానికి సంబంధించి సెకండ్ సింగిల్ 'మా ఊరు రాయవలస' శనివారం ఘనంగా విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. "పాట చాలా అద్భుతంగా ఉంది. 'రాయవలస' సినిమా కంటెంట్, కథనంలో మంచి దమ్ము కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను తనదైన పవర్‌ఫుల్ గొంతుతో పాడి కొత్త ఊపు తీసుకొచ్చారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని చిత్ర బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని విశ్వక్ సేనే పేర్కొన్నారు.

గ్లోబల్ లెవెల్‌లో 'రింగుడు రింగుడు' జోరు
ఇప్పటికే విడుదలై ఈ సినిమాలోని తొలి జానపద గీతం 'రింగుడు రింగుడు' సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ధనుంజయ్, సాహితీ చాగంటి ఆలపించిన ఈ సాంగ్ ఇప్పటివరకు 12 లక్షలకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు అరంగేట్ర హీరో, అరంగేట్ర డైరెక్టర్ అయినప్పటికీ.. ఈ సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. అమెరికాలోని ప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై 'రింగుడు రింగుడు' పాట విజువల్స్‌ను ప్రదర్శించడం విశేషం. తెలుగు పల్లెటూరి జానపద కళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్తూ చిత్రబృందం టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల మేళవింపుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ తదితర సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్ బాల సంగీతాన్ని సమకూర్చగా.. రాఖీ స్టోరీ అందించారు. కిట్టు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించగా.. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ పనులు పూర్తిచేశారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల కలయికతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.














Click it and Unblock the Notifications
