అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ అదేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించారు అల్లు అర్జున్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీతో రాకా అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దీపావళి పండుగకు కూడా చిత్ర యూనిట్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా షెడ్యూల్ ను కొనసాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.
ఇక ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నారు. అలాగే రష్మిక మందాన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు అల్లు అర్జున్ .. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై క్రేజీ అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాక ఈ సినిమాకు 'గ్యాంగ్ స్టర్' అనే వర్కింగ్ టైటిల్ ను సైతం ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో లోకేష్ కనగరాజ్ స్టైల్ హీరోయిజం, ఎలివేషన్లు భారీగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీలో అల్లు అర్జున్ మేకోవర్, లుక్ కొత్తగా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 2028 లో విడుదల అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
