సంక్రాంతి నుంచి రేషన్ లబ్దిదారులకు మరో తీపికబురు సిద్ధం చేస్తున్న తెలంగాణా ప్రభుత్వం

తెలంగాణ రేషన్ కార్డుదారులకు మరో తీపికబురు చెప్పటానికి సన్నాహాలు చేస్తోంది తెలంగాణా ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో కేవలం సన్నబియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఇకపై బియ్యంతో పాటు మరో ఆరు రకాల నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులు, పెరుగుతున్న ధరల నేపథ్యంలో పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో ఈ ప్రతిపాదన ముందుకు వచ్చింది.

సంక్రాంతి నుంచి ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నారు.పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటి కింద సుమారు 3.42 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యం అందుతోంది. ఇప్పుడు దీనికి తోడుగా కందిపప్పు, పామాయిల్, గోధుమపిండి, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి వస్తువులను కూడా సబ్సిడీ ధరలకు లేదా రాయితీపై అందించాలని పరిశీలిస్తున్నారు.

Telangana ration Plans to Supply Essential Commodities Along with Ration Rice from Sankranthi

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు, సబ్బులు వంటి పలు సరుకులు రేషన్ దుకాణాల్లో అందేవి. ఇప్పుడు ఆ నమూనాను మళ్లీ తీసుకురావాలని తెలంగాణా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం సుమారు 100 రూపాయలకు చేరుకుంది. పప్పులు, నూనె, మసాలా ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇలాంటి సమయంలో రేషన్ దుకాణాల్లోనే అవసరమైన సరుకులు అందితే పేద కుటుంబాలకు భారీ ఉపశమనం లభిస్తుంది.ప్రభుత్వం ఆహార భద్రత కోసం కూడా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వ ఉంది. మరో 18.39 లక్షల టన్నులు రాబోతున్నాయి. మొత్తం 28.03 లక్షల టన్నులు అందుబాటులోకి వస్తే 2027 సెప్టెంబర్ వరకు సరిపోతాయని అంచనా.

ఎల్‌నినో కరవుపై సమష్టి పోరాటానికి అఖిలపక్ష సమావేశం.. జరిగిందిదే!
ఎల్‌నినో కరవుపై సమష్టి పోరాటానికి అఖిలపక్ష సమావేశం.. జరిగిందిదే!

ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే సీజన్లలో పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున 14 నెలల నుంచి 16 నెలల వరకు సరిపడా బఫర్ స్టాక్ సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ ప్రతిపాదన అమలు కావాలంటే బడ్జెట్, నిల్వలు, పంపిణీ పరిమాణం, సేకరణ వ్యవస్థపై లెక్కలు వేయాల్సి ఉంది. అధికారులు వివిధ నమూనాలను పరిశీలించి ప్రతి లబ్ధిదారుడికి ఎంత మొత్తం అందించాలో నిర్ణయించాలి. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం తీసుకుని అమలు చేస్తారు. సంక్రాంతి సమయానికి ఈ పథకం ప్రారంభమైతే పేద ప్రజలకు పెద్ద ఊరట కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+