మోక్షజ్ఞ కోసం బాలయ్యతో మాట్లాడిన పవన్ కల్యాణ్

నటరత్న నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆత్రుతగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే బాలయ్య ఇప్పటివరకు మోక్షజ్ఞ ఎంట్రీ పైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకానొక దశలో మోక్షజ్ఞ లుక్స్ చూసి సినిమాల్లోకి పనికిరాడంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. అయితే బాలకృష్ణ మాత్రం కచ్చితంగా తన కుమారుడి ఎంట్రీ ఉంటుందంటూ చెప్పేవారు.

తన డైరెక్షన్ లోనే ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ నటించబోతున్నాడని బాలయ్య చెప్పాడు కానీ దాన్నిగురించి ఎటువంటి ప్రకటనా రాలేదు. వచ్చే ఏడాది ఉండొచ్చంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో బాలయ్య అభిమానులు ఫుల్లు ఖుషీ అవుతున్నారు. మొదటి సినిమాకి డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? ఎలాంటి కథాంశంతో రాబోతున్నారు? అనే విషయాలపై అభిమానుల్లో ఎగ్జైటింగ్ ఏర్పడింది.

pawan kalyan entered for nandamuri mokshagna

ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల అని, డైరెక్టర్ అనిల్ రావిపూడి అని కొంతమంది ప్రచారం చేయగా మరికొందరు మాత్రం బోయపాటి శ్రీనుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అనూహ్యంగా మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ బాలయ్యకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి ఒక కథను వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో బాలకృష్ణ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ కూడా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తరఫున బాలయ్యతో మాట్లాడాడని, తన లో చాలా టాలెంట్ ఉందని, చాలా కంఫర్ట్ గా అనిపిస్తారంటూ బాలయ్యతో చెప్పారంట. ఆ మాట చెప్పడంతో బాలయ్య కూడా.. ఇలాంటి డైరెక్టర్ కోసమే ఎదురు చూస్తున్నానని, సబ్జెక్టును కూడా లాక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం నితిన్ తో కలిసి తమ్ముడు అనే సినిమాని చేస్తున్నాడు. దీనితర్వాత మోక్షజ్ఞ తో సినిమా ఉండే అవకాశం ఉందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+