మీతో ఉంటూ వేరొకరితో సంసారం చేస్తే ఓకేనా
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే రేణు దేశాయ్ ఇప్పుడు తరచూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు.
రేణు దేశాయ్ చాలాకాలం తరువాత తెలుగు సినిమాలో నటించింది. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రేణు దేశాయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్‌తో వైవాహిక బంధం గురించి మరోసారి స్పందించారామె.

పవన్ కల్యాణ్‌తో కలిసి రేణు దేశాయ్ రెండు సినిమాల్లో నటించారు. బద్రి, జానీ సినిమాల్లో పవన్‌కు జోడి రేణు దేశాయ్ కనిపించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ సహజీవనంగా మారి ఆ తరువాత పెళ్లి వరకు దారి తీసింది. పవన్‌ను పెళ్లి చేసుకున్న తరువాత రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే రేణు దేశాయ్ ఇద్దరు పిల్లల్ని కన్న తరువాత రష్యా అమ్మాయి అన్నా లెజినోవాతో పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు.
ఆమెతో సహజీవనం చేస్తూనే ఓ బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. ఈ విషయాన్ని రేణు దేశాయ్‌నే గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ఆ తరువాత రేణు దేశాయ్‌కి విడాకులిచ్చిన పవన్ కల్యాణ్..అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నాడు. తాజాగా దీనిపై మాట్లాడుతూ..పవన్‌ను ఉద్దేశించి పరొక్షంగా ఆయన ఒక అమ్మాయితో బేబీని కన్నారు.
ఈ మాటలు నేను చెప్పడానికి చాలా ఈజీగా అనిపించినప్పటికీ.. నిజ జీవితంలో ఇది చాలా కష్టంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి.మీ భర్తగా ఆయన ఉండి ..ఇలా మీతో చేస్తే మీకు ఏమనిపిస్తుందని రేణు దేశాయ్ అభిమానులను ప్రశ్నించారు. 11 ఏళ్ల కాపురం తరువాత వేరే మహిళతో ఓ బిడ్డను కంటే మీకు ఓకేనా. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందని పవన్ కల్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ కౌంటరిచ్చింది.












Click it and Unblock the Notifications