నన్ను కలవాలనుకునే ఆలోచన మానుకో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీతోపాటు సినీ పరిశ్రమపై విరుచుకుపడినరోజు రాత్రే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. పోలీసు అధికారులు అల్లు అర్జున్ పై ధ్వజమెత్తారు. దాదాపు 10వేల వీడియోలను విశ్లేషించి అల్లు అర్జున్ చేసిన తప్పును బయటపెట్టారు. ఈ తరుణంలో కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయటపడతాడా? అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎట్ వెయిట్ అంటున్నారు
జైలు నుంచి విడుదలైన తర్వాత మెగా కాంపౌండ్ లోకి అల్లు అర్జున్ అడుగుపెట్టాడు. స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి చిరంజీవి ఇంటికి వెళ్లాడు. గంట సమయం గడిపి భోజనం చేసి తర్వాత నాగబాబు ఇంటికి కూడా వెళ్లాడు. నాగబాబు అయితే అప్పటివరకు బన్నీతో ఉన్న విభేదాలన్నీ మరిచిపోయి ఆప్యాయంగా కౌగిలించుకొని సాదరంగా ఇంట్లోకి తీసుకువెళ్లాడు. జరిగిన సంఘటనపై ఇద్దరూ చర్చించుకున్నారు. తర్వాత కలవాల్సింది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నే. పవన్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరగా ఇంతవరకు అనుమతిరాలేదు. అవుననికానీ, కాదనికానీ సమాధానం రావడంలేదు. ఎట్ వెయిట్ అంటున్నారు.

వివాదం జఠిలమవుతుంది
ప్రస్తుతం ఉన్న తరుణంలో తప్పంతా అల్లు అర్జున్ వైపే ఉందంటూ అందరూ వేలెత్తిచూపుతున్నారు. ప్రస్తుతం పవన్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట తర్వాత బన్నీ మీడియా సమావేశం రాజకీయ రంగు పులుముకుంది. ఇటువంటి తరుణంతో బన్నీతో పవన్ కల్యాణ్ సమావేశమైతే అది రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. వీటిని అంచనా వేసుకున్న పవన్ కల్యాణ్ బన్నీకి అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోగా ఉంటే వెంటనే కలిసేవాడు. కానీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వివాదం మరింత జఠిలం కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ ను కలవకపోవడమే ఉత్తమమనే యోచనలో పవన్ ఉన్నారు. పవన్ ఆలోచన ఎంతవరకు సరైందనేది రానున్న రోజుల్లో మారే రాజకీయ పరిణామాలు చెబుతాయి. అప్పటివరకు ఎదురుచూడాల్సిందే.












Click it and Unblock the Notifications