టాలీవుడ్‌లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడపాదడపా వినిపించే 'క్యాస్టింగ్ కౌచ్' అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగు మూలాలున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పికు నెమలి తాజాగా చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి.. ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తనను సినిమా అవకాశాల పేరుతో వేధించారని.. ఓ రిసార్ట్ కు రావాలని ఒత్తిడి చేశారని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణాలను బయటపెడుతూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

నటి పూనమ్ కౌర్ ఘాటు స్పందన
మహిళల సమస్యలపై.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని అన్యాయాలపై ఎప్పుడూ గళమెత్తే నటి పూనమ్ కౌర్ ఈ ఘటనపై అత్యంత ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పికు నెమలికి మద్దతుగా నిలుస్తూనే, టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిపై ఆమె విమర్శలు గుప్పించారు. తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో సరైన గౌరవం, అవకాశాలు దక్కకపోవడానకి ఇలాంటి వేధింపులే ప్రధాన కారణమని పూనమ్ కౌర్ అభిప్రాయపడ్డారు. పారదర్శకత లేని చోట ప్రతిభకు విలువ ఉండదని పూనమ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Poonam Kaur Backs NRI Girl Allegations Against Producer Casting Couch Row Hits Tollywood Again

సావిత్రి, సౌందర్య వంటి నటీమణులు ఎందుకు లేరు?
నటి పూనమ్ కౌర్ ఓ ఆసక్తికరమైన, ఆలోచింపజేసే ప్రశ్నను లేవనెత్తారు. "తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సావిత్రి, జయప్రద, భానుప్రియ, శ్రీదేవి, సౌందర్య వంటి గొప్ప నటీమణులు ఎందుకు లేరో చెప్పడానికి కారణం ఇదే" అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో తెలుగు అమ్మాయిలు నటనలో అద్భుతాలు సృష్టించేవారని, కానీ ప్రస్తుత పరిస్థితులు, ఇండస్ట్రీలోని వేధింపుల వల్లే ప్రతిభావంతులైన తెలుగు యువతులు ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతున్నారని లేదా మధ్యలోనే కెరీర్‌ను వదిలేస్తున్నారని పూనమ్ కౌర్ పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనేది కొత్త సమస్య కాకపోయినప్పటికీ.. ప్రతిసారీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ప్రతిష్ట దెబ్బతింటోంది. గతంలో కూడా పలువురు నటీమణులు బహిరంగంగానే తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. అవకాశాల కోసం లైంగికంగా వేధించడం, రిసార్టులకు రమ్మని ఒత్తిడి చేయడం వంటి పద్ధతులు ఇంకా కొనసాగుతుండటం పట్ల మహిళా సంఘాలు, సినీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మార్పు రావాల్సిన సమయం
పూనమ్ కౌర్ చేసి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నెటిజన్లలో ఓ వర్గం ఆమెకు పూర్తి మద్దతు తెలుపుతుండగా.. మరో వర్గం సదరు నిర్మాతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వం కలిసి ఓ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మళ్లీ తెలుగు తెరపై సావిత్రి, సౌందర్య వంటి గొప్ప నటీమణులను చూసే అవకాశం దక్కుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+