త్రివిక్రమ్‌పై పూనమ్ సంచలన ట్వీట్.. ఆ మూవీ విషయంలో అవసరమా ?
హీరోయిన్ పూనమ్ కౌర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించగా.. ఆ తర్వాత సహాయ పాత్రల్లో కూడా మెప్పించారు. ఆ తర్వాత తమిళ , కన్నడ బాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి తన గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటుంది.
అయితే హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్‌లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన ఆరోపణలు చేస్తూ ఉంటుంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ పోస్టులు పెట్టారు. అలానే త్రివిక్రమ్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది పూనమ్. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్‌పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్‌ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మా అసోసియేషన్‌లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతడ్ని ప్రశ్నించలేదని , యాక్షన్ తీసుకోలేదని.. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతడ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ త్రివిక్రమ్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా మరోసారి త్రివిక్రమ్‌పై ఆమె షాకింగ్ పోస్ట్ పెట్టారు.
ఆ పోస్టులో..
ఒరిజినల్ కంటెంట్, బౌండెడ్ స్క్రిప్ట్ ఉన్న డైరెక్టర్ క్రిష్ కి కూడా అంతటి గుర్తింపు దక్కలేదు. కానీ కాపీ రైట్స్ ఇష్యూస్ ఉన్న ఆ దర్శకుడికి మాత్రం అంత గుర్తింపు ఇస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే ట్వీట్ ని డిలీట్ చేశారు. కాగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో క్రిష్ తప్పుకోగా.. జ్యోతి కృష్ణ ప్రస్తుతం దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ విషయంలో కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో సహాయం చేసినట్టు టాక్ నడుస్తోంది. అందుకు గాను టైటిల్ కార్డ్స్ లో స్పెషల్ థాంక్స్ మెన్షన్ చేస్తారని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. తొలి భాగం " స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ " పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. జూలై 24న ఈ మూవీ రిలీజ్ కానుంది.
-
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ ! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాలు! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications