హీరో విజయ్ కొత్త పార్టీ, రోజా హీరో సంచలన వ్యాఖ్యలు, అందరూ సీఎంలు అయిపోతారా?, ఓటు అంటే!
సినిమా హీరోలు, కళాకారులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొత్త కాదు. నేటికీ చాలా మంది నటీనటులు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. సినీ పరిశ్రమలో వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుని సీఎంలుగా పట్టాభిషేకం చేయించుకున్న వాళ్లు ఉన్నారు. తమిళ నటుడు దళపతి విజయ్ కూడా అదే బాటలో రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
అయితే నేను హీరో విజయ్‌కి ఓటు వేయను అని ప్రముఖ నటుడు, రోజా హీరో అరవింద్ స్వామి బహిరంగంగానే చెప్పడం కలకలం రేపింది.

దళపతి విజయ్ 60కి పైగా సినిమాల్లో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నాడు. తమిళ సినీరంగంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత విపరీతమైన ష్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో విజయ్ అతనికంటూ ప్రత్యేకమైన అభిమానులను సృష్టించుకున్నాడు.
సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్స్ లిస్ట్ లో కూడా విజయ్ ఉన్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలా రోజులుగా చర్చ నడిచింది. ఇప్పుడు హీరో విజయ్ కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించారు. హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించాడు. దళపతి విజయ్ తమిళనాడు రాజకీయ రంగ ప్రవేశం చెయ్యడంతో ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాల్లో జనం మెచచిన నాయకుడి పాత్రల్లో నటించిన విజయ్ సమాజంలో జరుగుతున్న అవినీతిపై, అలాగే అవినీతి రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాబట్టి ఇలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కొందరు భావిస్తున్నారు. అభిమానుల్లాగే విజయ్ కూడా సంక్రాంతి పండుగ తరువాత రాజకీయాల్లోకి గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చేశాడు. దళపతి విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశాడు. ఆ దిశగా పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు హీరో విజయ్ ప్రయత్నిస్తున్నారు. సినీ నటులు అందరూ రాజకీయాల్లో మ్యాజిక్ చేయగలరా?, సినిమా చూసి ఈలలు, చప్పట్లు కొట్టిన వారు ఓటు వేసి వాళ్ల హీరోలను గెలిపిస్తారా? అనే ప్రశ్న మొదలైంది.
ఎంజీఆర్, ఎన్ టీఆర్, జయలలిత వంటి వారు రాజకీయ రంగంలో గొప్ప విజయాలు సాధించారు. ఈ ముగ్గురు అభిమానులను అలరించి సీఎంలుగా పని చేసి ప్రజాసేవ చేసి ప్రజల్లో చెరగని ముద్రవేసుకున్నారు.న అలాగే మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కూడా రాజకీయాల్లోకి వచ్చి పోరాటం చేశారు. అయితే చిరంజీవి రాజకీయాలకు దూరం కావడంతో పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వీరితో పాటు ఇంకా కొంత మంది నటీనటులు రాజకీయాల్లో ఉన్నారు.
Well said👏👏
— AmuthaBharathi (@CinemaWithAB) February 3, 2024
Hope TVK will make a big impact to the people of TN🤞 pic.twitter.com/hdx9dkvk3o
దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత ప్రముఖ నటుడు, రోజా ఫేమ్ అరవింద్ స్వామి చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రోజా హీరో అరవింద్ స్వామి హీరో విజయ్ ని సూటిగా ప్రశ్నించారు. హీరో విజయ్ కొత్త పార్టీ స్థాపనపై అరవింద్ స్వామి మాట్లాడారు నేను రజినీకాంత్ సార్, కమల్ హాసన్ సార్‌లకు పెద్ద ఫ్యాన్‌ని, అలాగే హీరో విజయ్ అంటే నాకు కూడా ఇష్టం అని, అలా అని ఆయన పెట్టిన పార్టీకి మాత్రం తాను ఎట్టిపరిస్థితిలో ఓటు వెయ్యనని ప్రముఖ నటుడు అరవింద్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హీరో విజయ్ కి మాత్రం తాను ఓటు వెయ్యనని, ఇంకోకరి గురించి నాకు తెలిదని అరవింద్ సామి అన్నారు. మీరు రాజకీయాల్లోకి వస్తే ఏమైనా మార్పు వస్తుందా ?, మార్పు తీసుకురావడం నీకు సాధ్యమేనా ?, ముందు నీ ఉద్దేశం, మీరు తీసుకోబోయే చర్యలు ప్రజలు తెలుసుకోవాలని, నువ్వు గొప్ప నటుడివి అయితే రాజకీయాల్లో నిన్ను తాను ఎలా నమ్ముతాను అంటూ హీరో విజయ్ ని నటుడు అరవింద్ స్వామి ప్రశ్నించారు. అసలు మంచి రాజకీయ విధానాన్ని తీసుకురావడానికి మీకు అర్హత ఉందా? అని అరవింద్ సామి మీరో విజయ్ ని సూటిగా ప్రశ్నించారు.
మీకు మంచి ఉద్దేశాలు ఉండవచ్చు. మీరు చాలా కాలం సినిమాల్లో నటిస్తూ ప్రజలను ఆకట్టుకుని ఉండవచ్చు, అలాగే మీరు రాజకీయ రంగానికి వచ్చి ప్రజలను ఆకట్టుకోవాలని భావించి ఉండవచ్చు. స్టార్ నటులందరూ ఇలాగే ఫీల్ అవుతారని హీరో విజయ్ ని ఉద్దేశించి అరవింద్ స్వామి మాట్లాడారు. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి, విధానాలను అమలు చేయడానికి మీకు ఎంత జ్ఞానం ఉందని, అయితే మీకు అధి కుదరదని తాను అనుకోవడం లేదని, దాని కోసం కష్టపడాలని తమిళ హీరో విజయ్ ని ఉద్దేశించి నటుడు అరవింద్ స్వామి అన్నారు.
మీ చుట్టూ మంచి వ్యక్తులు ఉండవచ్చు, కానీ వారు ఏమి మంచి చేస్తారో చూడడానికి, వారికి సలహా ఇవ్వడానికి నాయకుడిగా మీకు కొంత అవగాహన అవసరం అని హీరో విజయ్ ని ఉద్దేశించి ప్రముఖ నటుడు అరవిందస్వామి మాట్లాడారు. ఐదేళ్ల క్రితం అరవింద్ స్వామి ఇచ్చిన ఈ ఇంటర్వూ ఇప్పుడు వైరల్ అవుతోంది. స్టార్ నటులు రాజకీయ రంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు అరవింద్ స్వామి స్పందించారు. హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టిన సందర్బంగా అరవిందస్వామి పాత వీడియో బయటకు రావడంతో ఇప్పుడు తమిళనాడులోని వాట్సాప్ గ్రూప్ ల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. స్టార్ యాక్టర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినంత మాత్రాన ప్రజలు వారికి ఓటు వేయకూడదని అరవింద్ స్వామి చెప్పిన మాట వాస్తవమే అని, ఇలాగే తమిళనాడులోని ప్రజలు అందరూ ఆలోచించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications