ప్రభాస్ - త్రివిక్రమ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
పాన్ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి తన సినిమా విడుదలయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ లన్నీ బతుకుతున్నాయంటూ ఆయా మల్టీప్లెక్స్ ల యాజమాన్యమే స్వయంగా సమావేశం ఏర్పాటుచేసి వెల్లడించింది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చేస్తున్నారు. దీనితర్వాత సందీప్ దర్శకత్వంలో స్పిరిట్ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా కల్కి2, సలార్2 ఉన్నాయి. అలాగే హోంబలే ఫిలింస్ కు మూడు సినిమాలపై ఒప్పందం కుదిరింది.
అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురు చూశారు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు తాను చేయని కొత్త జోనర్ లో సినిమా చేయబోతున్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న కథను ఇందుకు ఎంచుకున్నారు. పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్ తయారుచేసేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందనే అంచనాలున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ ఇంతవరకు నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అభిమానులు ఎదురుచూశారుకానీ వీలవలేదు.

బాహుబలికి ఒప్పందం కుదిరిపోవడంతో..
బాహుబలికి ముందు ప్రభాస్ మిర్చి సినిమా చేశారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు బాహుబలికే కేటాయించారు. ఆ సమయంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ కథను సిద్ధం చేసి ప్రభాస్ కు వినిపించారు. అయితే బాహుబలికి ఐదు సంవత్సరాల ఒప్పందం కుదిరిపోవడంతో ఈ సినిమా తెరకెక్కలేదు. ఆ కథను అలాగే ఉంచారా? లేదంటే వేరే హీరోతో ఏమైనా తెరకెక్కించారా? అనే విషయంలో త్రివిక్రమ్ స్పష్టత ఇవ్వలేదు. కానీ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చివుంటే మాత్రం పరిశ్రమలో రికార్డులన్నింటినీ బద్ధలు కొట్టివుండేదని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications