గుండె ముక్కలైంది.. కాపాడుకోలేకపోయాం.. క్షమించండి
Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇటు భారత్ లోనూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ దుశ్చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పహల్గాం ఉగ్రదాడిపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన 2 పేజీల సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇది కాశ్మీర్ మొత్తంపై జరిగిన మారణహోమంగా ఆయన అభివర్ణించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత్ ఇలాంటి చర్యలను ఎప్పటికీ క్షమించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ఎమోషనల్ లేఖను ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

పహల్గాం ఉగ్రదాడి తన హృదయాన్ని మెలిపెట్టిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, కథనాలు చూసి తన రక్తం మరిగిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటిని క్షమించకూడదని, ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. భారత్ ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోదని.. త్వరలోనే ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.
Listen to this Voice from Kashmir . 🙏🏿🙏🏿🙏🏿💔💔💔 #PahalgamTerrorAttack pic.twitter.com/CJGsXcy3O1
— Prakash Raj (@prakashraaj) April 24, 2025
ఈ మేరకు దాడి ఘటనపై కాశ్మీర్ ఎలా స్పందిస్తుందో అన్న దానిపై ప్రకాశ్ రాజ్ రెండు పేజీల లేఖను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కశ్మీర్ ఆట స్థలం కాదని.. యుద్ధ క్షేత్రం అంతకంటే కాదు.. ఉగ్రవాదులు ఉపయోగించుకునే ఆయుధం కాదని.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశం మాత్రమే అని ప్రకాశ్ రాజ్ తన లేఖలో చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మీతో మేము దుఃఖిస్తున్నాం.. మీరు కోల్పోయిన దానికి చింతిస్తున్నాం.. మీరు కాశ్మీర్ లో ప్రశాంతంగా ఉండటనికి వచ్చారు.. కానీ, మేము దానిని కాపాడుకోలేకపోయాం.. అందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాశ్ రాజ్ పోస్ట్ పెట్టారు.












Click it and Unblock the Notifications