SSMB 29లో హీరోయిన్ ఆమేనంట... థియేటర్లలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చు?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రాన్ని ఎస్ఎస్ఎంబీ 29 పేరుతో వ్యవహరిస్తున్నారు. మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన ఈ కార్యక్రమంలో కొంతమంది సినిమా సభ్యులే పాల్గొన్నారు. ప్రస్తుతం షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. మీడియాకు తెలిస్తే అభిమానులు వస్తారేమో, తొక్కిసలాట జరుగుతుందేమోనన్న అనుమానంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ లో అడుగు పెట్టిన ప్రియాంక
ఈ సినిమా హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతోంది. పాన్ వరల్డ్ సినిమాగా, అంతర్జాతీయస్థాయిలో, హాలీవుడ్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమా కాబట్టి హాలీవుడ్ కు చెందిన నవోమీ స్కాట్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎటువంటి ధ్రువీకరణ చిత్ర యూనిట్ ఇవ్వలేదు. మరోవైపు ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి ఊతమిచ్చేలా ఆమె తాజాగా హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

BREAKING: Priyanka Chopra lands🛬 in Hyderabad for Mahesh Babu - Rajamouli project SSMB29. pic.twitter.com/6x131pNj7v
— Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2025
వీడియోను షేర్ చేసిన ప్రియాంక
నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక ఇండియా రావడంలేదు. హాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. అక్కడే సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఈ క్రమంలో భర్తతో కలిసి టొరంటో నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఈమేనని, షూటింగ్ కూడా జరుగుతుండటంతో అందులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలియదుకానీ ప్రియాంక చోప్రా హీరోయిన్ అయితే థియేటర్లకు దుప్పట్లు తీసుకువెళ్లి గుర్రుపెట్టి నిద్రపోవచ్చు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు పక్కన నవోమీ స్కాట్ బాగుంటుందని, ప్రియాంక చోప్రా అక్కలా ఉంటుందంటూ కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications