మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..ఆనందంలో దిల్ రాజు
మెగా అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. 'భోళా శంకర్' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'విశ్వంభర'. 'బింబిసార' వంటి హిట్ తర్వాత దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదైలన చిరంజీవి ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా విశ్వంభర తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష, యంగ్ బ్యూటీ అశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తైంది.
అయితే ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' కూడా సంక్రాంతికి విడుదల కానుండటంతోనే 'విశ్వంభర' మేకర్స్ సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు. రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జంటగా నటిస్తోంది. ఎస్.జే సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

'గేమ్ ఛేంజర్' ను తొలుత డిసెంబర్‌లో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్' సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే విశ్వంభర వాయిదా వేయడంపై ఆయన స్పందించారు. విశ్వంభర వాయిదా వేయడంపై మెగాస్టార్‌కు, విశ్వంభర చిత్ర నిర్మాతలకు గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్‌రాజు ధన్యవాదాలు చెప్పారు. ఇక దసరా సందర్భంగా 'విశ్వంభర' టీజర్ విడుదల అయింది.












Click it and Unblock the Notifications