చిరంజీవి సినిమాపై నిర్మాత దారుణ కామెంట్స్
ఇప్పుడైతే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు కానీ, గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. పైకి బాగానే ఉన్నప్పటికి లోలోపల మాత్రం అధిపత్యపోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్సును వెళ్లగక్కేవారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
రాజకీయాలు అంటే ఎమోషన్ కాదు. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఏం పీకాడు. గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్‌కి వెళ్ళాడు. అక్కడ ఆటోగ్రాఫ్స్ ఇవ్వడమే సరిపోయింది. చిరంజీవి కూడా అంతే. రాజకీయాల్లో అందరూ రాణించలేరు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు...అంటూ చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు. తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటరిచ్చారు.

బ్లడ్, బ్రీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది. అమితాబ్, చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలవడంతో ఇరు కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ప్రముఖ నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగ వంశీ మాట్లాడుతూ.. చిరంజీవి'వాల్తేరు వీరయ్య' కంటే బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాను బాబీ బాగా తెరకెక్కించారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ అది నిజమని చెప్పుకొచ్చారు. నాగ వంశీ మాటలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నాగ వంశీ హీరోలకు భజన చేయడం అప్పలంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగ వంశీ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications