హాస్పిటల్ బెడ్ పై రాధేశ్యామ్ ఫేమ్ నటి 'భాగ్యశ్రీ'.. ఆందోళనలో ఫ్యాన్స్ !
ప్రముఖ సీనియర్ నటి భాగ్యశ్రీ హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితురాలే. 1989లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'మైనే ప్యార్ కియా'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరం అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత 2021లో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన 'తలైవి'తో మళ్లీ వెండి తెరకు రీఎంట్రీ ఇచ్చింది. అలానే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' లో ఆయనకు తల్లిగా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత చేరువైంది.
అయితే ఈమె హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఆమెకు ఏం జరిగిందని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. దాంతో తాను ప్రస్తుతంబగానే ఉన్నాను అంటూ నవ్వుతూ ఒక ఫోటోను షేర్ చేసింది భాగ్యశ్రీ. అయితే ఆమె తలకు గాయం స్పష్టంగా కనిపిస్తోండడంతో ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు.

ఆమె హాస్పిటల్ లో చేరడానికి గల కారణాలను ఆమె సన్నిహితులు వెల్లడించారు. పికిల్ బాల్ ఆడుతున్న సమయంలో తన తలకు గాయం కావడంతో వెంటనే తనను ఆసుపత్రికి తరలించారట. తలకు గాయం చాలా బలంగా తగలడంతో ఆసుపత్రికి చేరుకోగానే భాగ్యశ్రీకి సర్జరీ చేశారట వైద్యులు. దాదాపు 13 కుట్లు కూడా పడ్డాయని భాగ్యశ్రీ బంధువులు తెలిపారు. హాస్పిటల్ స్టాఫ్ లో ఎవరో ఒకరి ద్వారా భాగ్యశ్రీ బెడ్‌పై పడుకొని ఉన్న ఫోటో బయటికొచ్చిందని భావిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications