మహేష్ బాబు, ప్రభాస్ తో ఐటమ్ సాంగ్స్ చేసి వారికే తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి పాత్రలు వస్తాయో ఊహించడం కష్టం. దర్శక నిర్మాతలు ఏ పాత్ర ఇచ్చినా దానికి తగ్గట్లుగా నటించి మెప్పించడమే నటీనటుల పని. ఈ క్రమంలో ఒకే నటి.. అదే హీరోకి తల్లిగా, చెల్లిగా, అక్కగా, ఆఖరికి ప్రేయసి.. ఇలా అనేక పాత్రల్లో కి మారొచ్చు. అందుకే సినీ ఇండస్టీ అంటేనే ఓ రంగుల ప్రపంచంగా పిలుస్తారు.
అయితే తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటి రమ్యకృష్ణ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె అప్పట్లో నీలాంబరిగా, ఇటీవల శివగామిగా మెప్పించింది. ఆమె ఇప్పటికే అనేక పాత్రల్లో మెరిచింది. అయితే ఆమె గురించిన ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ప్రభాస్, మహేష్ బాబులతో ఐటమ్ సాంగ్స్ లో నటించి, తరువాత వారికి తల్లిగా నటించిన ఏకైక నటి అని అర్థం అవుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో రమ్యకృష్ణ విచిత్రమైన కాంబినేషన్స్ లో నటించింది. ప్రభాస్ అడవి రాముడు చిత్రంలో రమ్యకృష్ణ జంటను విడదీసే అనే స్పెషల్ సాంగ్ లో నటించారు. ఆ పాట మంచి హిట్ సాధించింది. అయితే ఆ తర్వాత బాహుబలి చిత్రంలో ప్రభాస్ కు తల్లిగా శివగామి పాత్రలో నటించి మెప్పించింది.

ఇక ఇలాంటి కాంబినేషన్ మహేశ్ బాబుతో కూడా రిపీట్ అయింది. మహేశ్ బాబు నాని చిత్రంలో రమ్యకృష్ణ మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది. ఈ సాంగ్ లో మహేశ్ బాబుతో డాన్స్ అదరగొట్టింది. కానీ ఈ సాంగ్ ని థియేటర్ రిలీజ్ నుంచి డిలీట్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఆ తర్వాత ఇటీవల మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రంలో తల్లిగా నటించింది. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.












Click it and Unblock the Notifications