'రణబాలి' రిలీజ్ కు ముందు విజయ్ ఫ్యాన్స్ కు షాక్..!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ - నేషనల్ క్రష్ రష్మిక మందాన్న కాంబినేషన్ లో రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రం 'రణబాలి'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న క్రమంలో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సుమారు నాలుగు నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ మాస్ అండ్ వైలెంట్ గా ఉంది.
ఇందులో విజయ్ దేవరకొండ మాస్ విశ్వరూపం కనిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఒక్కసారిగా పెరిగాయి. విజయ్ దేవరకొండకు ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రానికి అజయ్- అతుల్ ద్వయం అద్భుతమైన మ్యూజిక్ ను అందించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఏందయ్యా సామి పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ పాటలో విజయ్- రష్మిక మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా పండింది. యూట్యూబ్ లో ఈ సాంగ్‌కు ఇప్పటికే 39 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక రణబాలి మూవీలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు.
అయితే రణబాలి రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్న క్రమంలో తాజాగా ఓ షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వస్తున్న కీలక సమాచారం ప్రకారం.. అక్టోబర్ 16న రణబాలి మూవీ విడుదల రోజున విదేశాల్లో కేవలం ఒరిజినల్ తెలుగు వెర్షన్ మాత్రమే ప్రదర్శించబడుతుందని తెలుస్తోంది. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ లకు సంబంధించిన కంటెంట్ సిద్ధం చేయడంలో ఏర్పడిన ఆలస్యం కారణంగా.. వాటి రిలీజ్‌ను అక్టోబర్ 23 కు వాయిదా వేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో విజయ్ కు మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రణబాలి మూవీకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ కేవలం ప్రీ-సేల్స్ ద్వారానే 50 వేల డాలర్ల మార్కును దాటడం విశేషం అని చెప్పొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 16 న రణబాలి మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications
