స్థానిక ఎన్నికల్లో సీట్లు వారికే, గెలుపు బాధ్యత వారిదే - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!

స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేసారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ నేతలకు ఎన్నికల పైన దిశా నిర్దేశం చేస్తూనే... క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ఆరా తీసారు. సీట్లు ఎవరికి కేటాయించేదీ స్పష్టత ఇచ్చారు. మిత్రపక్షాలతో కలిసి సమన్వయంతో సాగాలని స్పష్టం చేసారు. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కలిసి కట్టుగా పని చేసి అన్ని స్థానాలు గెలవాలని నిర్దేశించారు. ఈ ఎన్నికల్లో బలమే వచ్చే ఎన్నికల నాటికి కూటమి కి మేలు చేస్తుందని వివరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. బీసీల రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, వైసీపీ చేసిన అన్యాయాన్ని వివరించిన సీఎం చంద్రబాబు.. జయహో బీసీ...! జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలన్నారు.

స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబు బిగ్ డెసిషన్ - మంత్రుల సమర్థతకు పరీక్ష..!!
స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబు బిగ్ డెసిషన్ - మంత్రుల సమర్థతకు పరీక్ష..!!
CM Chandra Babu made clear directions and strategies for party leaders over local body Elections

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం మేర పార్టీ పరంగా సీట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని చెప్పారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని... కలిసి ప్రచారం చేయాలంటూ సీఎం నిర్దేశించారు. డబులింజన్ సర్కారుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావాలని చెపపుకొచ్చారు. 50 రోజులు.. ఎవ్వరికీ మినహాయింపు లేదు.. గెలుపే ధ్యేయంగా పని చేయాలని తేల్చి చెప్పారు.

ఎన్నికల్లో గెలుపు, నిజాయితీ, సమర్థత, సోషల్ రీ-ఇంజనీరింగ్ వంటి అంశాలను బేరీజు వేసుకు నే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేసారు. సిన్సియార్టీ లేకుండా డ్రామాలాడే వారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు.. అలాంటి వారిని ఊపేక్షించమని తేల్చి చెప్పారు.స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై రేటింగ్స్ ఇస్తాం. సరిగా పని చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు...కూటమి బలం మరింత పెరగాలంటే స్థానిక ఎన్నికలే కీలకమని వివరించారు.

 అమరావతికి తమిళనాడు సీఎం విజయ్ -చంద్రబాబు, పవన్ తో ప్రత్యేక భేటీ..!!
అమరావతికి తమిళనాడు సీఎం విజయ్ -చంద్రబాబు, పవన్ తో ప్రత్యేక భేటీ..!!

న్యూట్రల్స్ సానుభూతి పరులుగా... ప్రత్యర్థులు న్యూట్రల్సుగా మారేలా పార్టీ కేడర్ పని చేయాలని సూచించారు. రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశాం. అంతే మొత్తంలో అభివృద్ది పనులు చేశామని.. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి మించి స్థానాలు ఇస్తామని ప్రకటించామని... పార్టీ పరంగా 40 శాతం వరకు బీసీలకు సీట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకోవాలని.. పై స్థాయిలో ఎలాం టి సమన్వయం ఉందో.. క్షేత్ర స్థాయిలో అలాగే ఉండాలి. విభేదాలకు, అపోహలకు తావివ్వవద్దని చంద్రబాబు స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+