రూ.5లక్షల ఉచిత బీమాతో పాటు, తెలంగాణా ప్రజలకు డబుల్ బొనాంజా..ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే ఇందిరమ్మ బీమా పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. నవంబర్ 19న ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

కుటుంబానికి ఆదాయం సమకూర్చే పెద్ద వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం అని డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ఖమ్మంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా వెల్లడించారు. రాష్ట్రంలో కోటి 6 లక్షల కుటుంబాలకు చెందిన 3.42 కోట్ల మందికి ప్రతి నెలా 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 53 లక్షల మందికి గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్, 43 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.

Indiramma Bima Scheme with rs 5 lakh insurance and also rajiv yuva vikasam will be launch on Nov 19

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోటి 6 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు వైద్య సాయం అందుతోందని, 12.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి దశలో 4.5 లక్షల ఇళ్లు, రెండో దశలో మరో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు.

మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మెట్రోస్టేషన్ల నుండి నేరుగా మీ గమ్యస్థానాలకు..డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు!
మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మెట్రోస్టేషన్ల నుండి నేరుగా మీ గమ్యస్థానాలకు..డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు!

ఇందిరమ్మ బీమా పథకం అమల్లోకి వస్తే, కుటుంబ పెద్ద మరణించినా కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా రక్షణ కలుగుతుందన్నారు. ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లించనుందని పేర్కొన్నారు. ఈ పథకంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా నవంబర్ 19న ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+