ఎవరికి దగ్గర కావాలో నాకు తెలుసు.. రాశి ఖన్నా షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ రాశి ఖన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి.
ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికిని, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకుండా పోయింది. హిందీ మేకర్స్ ఎవరూ కూడా రాశి ఖన్నాకు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు.

ఇటీవలే తమిళంలో దర్శకుడు సుందర్ సీ తెరకెక్కించిన 'అరణ్మణై 4' అనే సినిమాలో నటించింది.రాశీ ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'అరణ్మణై 4'. సుందర్ సీ హీరోగా నటించారు. గత నెల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా రాశి ఖన్నా మాట్లాడుతూ..నాకు ఫ్యాన్స్‌కు ఎలా దగ్గర కావాలో తెలుసనని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు నేను తమిళం, తెలుగు భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలను. నేను ఇంతకు ముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. నేను ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నాను. ఇంతకు ముందు భాష వచ్చేది కాదు.. ఇప్పుడు అన్ని భాషలు అర్ధం అవుతున్నాయి. భాష వస్తే ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చని నాకు తెలుసు అని ఈ భామ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications