సైఫ్ అలీఖాన్-వైఎస్ షర్మిల మధ్య అనుబంధం గురించి తెలుసా..?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తి దాడికి గురైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు.ప్రాథమికంగా దొంగతనం కోసం అని పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటన సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగింది.నిందితుడు సైఫ్ అలీఖాన్‌ను కత్తితో పొడిచాడు. సైఫ్ అలీఖాన్‌కు గాయాలు అయ్యాయి.ఈ ఘటన జరిగినప్పుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో తన కుటుంబంతో ఉన్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సైఫ్ అలీఖాన్‌పై దాడి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సైఫ్ అలీఖాన్‌ల మధ్య అనుబంధం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిల ఠాగూర్. ఆమె ఒకప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. షర్మిల ఠాగూర్ తన అందం, నటనతో అప్పటి కాలంలో అందరి హృదయాలను దోచుకున్నారు.

షర్మిల ఠాగూర్ అందానికి ఫిదా కాని వ్యక్తి ఉండేవారు కాదంటే అతిశేయోక్తి కాదనిపిస్తోంది. దీనికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అతీతులు కాదు. షర్మిల ఠాగూర్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని అట. ఆ అభిమానంతోనే ఆయన తన కూతురికి తన ఫేవరెట్ హీరోయిన్ అయిన షర్మిల పేరు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల అనే పేరును తెలుగు ప్రజలు పెద్దగా పెట్టుకోరు. కానీ వైఎస్ఆర్ షర్మిల ఠాగూర్‌పై అభిమానంతో తన కూతురికి షర్మిల అని పేరు పెట్టారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications